
బిగ్ బాస్ 5: మళ్ళీ సేమ్ సీన్ రిపీట్... దుప్పట్లో 'షన్ను - సిరి'... ?
సన్నీ దెబ్బకి సిరి కనీసం బయట కాలు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేక అలానే చాలా సేపు ఉండి పోయింది. దీంతో షన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నావ్ అంటూ సిరి గురించి మనసులో పెట్టుకుని సన్నీపై ఫైర్ అయ్యాడు. సన్ని అప్పుడు అవేమీ పట్టించుకోకుండా గేమ్ పై ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ ఆ తరవాత గార్డెన్ లో కూర్చుని ఎమోషనల్ అయ్యారు. వాళ్ళు ఏమి చేసినా అది గేమ్ నేను చేస్తే మాత్రం ఆటిట్యూడ్, వాళ్ళని కావాలనే టార్గెట్ చేయడం అని అంటున్నారు అంటూ చాలా ఫీల్ అయ్యారు. మానస్, కాజల్ లు వచ్చి సన్ని ని ఓదార్చారు.
అయితే ఈ టాస్క్ సమయంలో షన్ను కావాలనే సన్ని ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని, అతడు మాటపై మాట అంటూనే ఉన్నాడని సన్ని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు సిరి కోసం గేమ్ ఆడుకోపో చిన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ టాస్క్ అయ్యాక సిరి, షన్ను ఎవరి బెడ్ వారు పడుకొని గేమ్ గురించి మాట్లాడుతుండగా...మద్యలో ఏమైందో ఏమో గానీ మళ్ళీ షన్ను దుప్పటిలోకి వచ్చి చేరిపోయింది సిరి. ఒకే దుప్పటిలో ఇద్దరు ఉన్నారు. సిరి షన్నుని గట్టిగా హగ్ చేసుకుని మరీ మాట్లాడుతుండగా ఈ వీడియో కాస్త కెమెరాల ముందు హైలెట్ అయ్యింది. దీని గురించి నెటిజన్ల నుండి మళ్లీ కామెంట్స్ వస్తున్నాయి.