టీవీ: కరోనా రావడంతో.. కాళ్లు పడిపోయిన నటుడు..!

Divya
ప్రస్తుతం కరోనా బారిన పడినవారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండనే ఉంటారు. అయితే ఈ కరోనా కొంతమందికి, ఎలా వస్తుందో తెలియకుండానే అలాగే వెళ్లిపోయింది. అయితే మరి కొంతమందికి మాత్రమే నరకం చూపిస్తూ ఉంటుంది ఈ కరోనా. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం తక్కువగా ఉండడంతో దీని బారిన పడే ప్రజలు తగ్గిపోయారు. అయితే దీని ప్రభావం మాత్రం ఇంకా ఇప్పటికీ చూపుతూనే ఉంది. అది ఎలా అంటే కొంతమందిలో నీరసం, తలనొప్పి, కాళ్లు లాగడం వంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే అలాంటి వారిలో బుల్లి తెర నటుడు సాయి కిరణ్ కూడా ఉన్నారు.
ఈ నటుడికి కరోనా వైరస్ సోకి తగ్గినప్పుడు.. తన రెండు కాళ్ళు పడిపోయాయంట. అలాంటి సమయంలో తను చాలా కేరింగ్ తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా శానిటైజర్ మాస్కు, తీయకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను. కానీ కొంతమందితో కలిసి పని చేసేటప్పుడు కరోనా వైరస్ సోకిందని తెలియజేశాడు. మొదటగా రుచి , వాసన తెలియక పోవడం.. ఏదైనా జ్యూస్ తాగినా సోడాల అనిపించడం ఇలా దాదాపుగా పది రోజుల పాటు తనకి ఏ రకంగా టేస్ట్ తెలియ లేదట.
అటు తర్వాత తనకి టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చినట్లు తెలియజేశారు.. అలా కోవిడ్ సోకడం తో తన రెండు కాళ్ళు పడిపోవడం మొదలయ్యాయట. ఒకరోజు బెడ్ మీద నుంచి దిగాలి అనుకున్నప్పుడు తన రెండు కాళ్ళు సహకరించ లేదట. బలవంతంగా లేచి నడిచే వాడినని చెప్పుకొచ్చాడు.. అలా నెమ్మదిగా కాళ్లు లేవలేని పరిస్థితిలో పడిపోయాను అని చెప్పుకొచ్చాడు.
కానీ తన మనసులో మాత్రం ఇక వీల్ చైర్ కి పరిమితం అవుతుందని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. కానీ డాక్టర్ దగ్గరికి వెళితే ఎలాంటి ప్రాబ్లం లేదు అని  తెలియజేశారు. కానీ బీ-12 విటమిన్ తగ్గడం వల్ల ఇలా అయిందని డాక్టరు తెలియడంతో ప్రతిరోజు ఒక ఇంజక్షన్ వేసుకున్న తర్వాత కొద్ది రోజులకు నడవగలిగానని చెప్పుకొచ్చారు. అందుకే ఎవరు ఇలాంటి కరోనా బారిన పడకండి అని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: