టీవీ: రావోయి చందమామ హీరో రియల్ లైఫ్ స్టోరీ..!!

Divya
ఈటీవీ సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రసారమవుతున్న రావోయి చందమామ సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించడమే కాకుండా నటీనటులు అందం , అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్నారు. రావోయి చందమామ సీరియల్ ఆడియన్స్ ను బాగా అలరిస్తూ మంచి టిఆర్పి రేటింగ్ కూడా సాధిస్తుంది. ఇకపోతే ఈ సీరియల్ లో నటిస్తున్న శివరాం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని ఎదురుచూస్తున్నారు. ఇక శివరాం రావోయి చందమామ సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
శివరాం అసలు పేరు రవిశంకర్ రాథోడ్. అక్టోబర్ ఒకటో తేదీన తిరుపతిలో జన్మించిన ఈయన తిరుపతిలోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. శివరాం కి ఒక అన్నయ్య కూడా ఉన్నారు. శివరాం డెంటల్ కోర్సు పూర్తి చేసి ఆ తర్వాత ఆర్ ఎస్ ఆర్ డెంటల్ కేర్ లో ఈయన వైద్యుడిగా పని చేసేవాడు. అయితే శివరాం చిన్నప్పటి నుంచి నటన మీద బాగా ఆసక్తి ఉండడంతో పాటు మంచి యాక్టర్ అవ్వాలనే కోరిక వుండేదట.
ఇకపోతే ఈయన డాక్టరుగా ఉంటూనే మరోవైపు యాక్టింగ్ వైపు అడుగులు వేయాలని ఎదురు చూశారు. ఇక అలా మొదటిసారి సీరియల్స్ లోకి అడుగు పెట్టాడు. మొదటి సీరియల్ తోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు శివరాం.. ఈటీవీ లో ప్రతి రోజు మధ్యాహ్నం ప్రసారమైన నాలుగు స్తంభాలాట అనే సీరియల్ లో ఈయన బాల అనే  హీరో క్యారెక్టర్ లో అక్కడ కూడా డాక్టర్ గానే పని చేశారు. ఇక ఆయన తండ్రి కృష్ణ కూడా విలన్ గా పని చేస్తూ ఉండేవారు. ఇకపోతే ప్రస్తుతం రావోయి చందమామ అనే సీరియల్లో హీరోగా  నటిస్తున్న ఈయన మంచి ప్రేక్షకాదరణ పొందుతూనే జెమినీలో ఆనంద రాగం అనే సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: