
టీవీ:సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న యాంకర్ సుమ..!!
ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ ను రామ్ చరణ్ తో , రానా తో మరొక ప్రమోషన్ కూడా చేయించింది. అయితే తాజాగా వినిపిస్తున్న మాట ఏమిటంటే.. ఈ సినిమా లో తాజాగా ఒక పాటకోసం రాజమౌళిని రంగంలోకి దింపే విధంగా ప్లాన్ చేసింది. కొన్ని గంటల క్రితం సినిమాకు సంబంధించి పాటను కూడా విడుదల చేయడం జరిగింది రాజమౌళి. ఈ పాటని సుమ స్వయంగానే పాడిందట. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఇక ఈ పాట తో ఈమె రెండవ సారి తన గానాన్ని వినిపించింది. ఇక విన్నర్ సినిమాలో ఒక పాటను పాడింది..మరి ఇప్పుడు తన చిత్రంలోనే పాడుకుంది.
ఈ సాంగ్ గురించి యాంకర్ సుమ తెలుపుతూ.. ఎం ఎం కీరవాణి సంగీత సారథ్యంలోనే ఈ పాటను నేను పాడగలిగాను... ఈ పాటకు అద్భుతంగా ట్యూన్ కూడా చేయడం జరిగింది. రామజోగయ్య శాస్త్రి ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారని తెలిపింది. ఇక అంతే కాకుండా జెడి మాస్టర్ కొరియోగ్రాఫర్ సూపర్ గా ఉందని యాంకర్ సుమ చెప్పకనే చెప్పేసింది. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడుతున్న ట్లుగా కూడా తెలియజేసింది.