టీవీ:జబర్దస్త్ ను వీడి కామెడీ స్టార్స్ లో ప్రత్యక్షమైన కమెడియన్స్..ఎందరంటే..!!

Divya
బుల్లితెరపై అప్పుడప్పుడు కొన్ని సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి కొన్ని షోలలో కొంతమంది సడన్ గా మానేసి వేరొక షోలో కనిపిస్తూ ఉంటారు.. అయితే మరికొందరు మాత్రం రెండు షోలను కవర్ చేస్తూ ఉంటారు.. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వర్కౌట్ కాలేదు.. ఎక్కడైనా ఒక చోట మాత్రమే ఉండాలనే నిబంధనలు ఆ షో నిర్వాహకులు పెట్టడం జరిగింది. ప్రస్తుతం జబర్దస్త్ లో నుంచి ఎంతోమంది వరుస గా బయటికి పోవడం జరిగింది. తాజాగా అదిరే అభి కూడా ఈ షోలో కనిపించలేదు.
జబర్దస్త్ స్థాపించినప్పటి నుంచి అదిరే అభి అందులోనే పని చేస్తూ ఉన్నాడు.. ఆయన దగ్గర శిష్యులుగా ఉన్నవారు ఎందరో టీం మెంబర్స్ గా ఎదగడం జరిగింది. అందులో హైపర్ ఆది ఒకరని చెప్పవచ్చు. ఇలా ఎందరినో జబర్దస్త్ కమెడియన్ల ని  పరిచయం చేశారు అదిరే అభి.అయితే ఈ మధ్యకాలంలో స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో జబర్దస్త్ కమెడియన్లు కనిపించడం మొదలు పెట్టారు. అయితే అది ఎక్కువ రోజులు నిలవలేదు.. కానీ తాజాగా కమెడియన్ స్టార్స్ ధమాకా గా పేరు మార్చి తాజాగా ఒక ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ గా మారుతోంది.ఇక అంతేకాకుండా ఇందులో కనిపించే వారంతా ఒకప్పుడు జబర్దస్త్ లో చేసిన ఆర్టిస్టులే.
ఇందులో ముఖ్యంగా అప్పారావ్, రాజమౌళి, జీవన్ వంటివారు ఉన్నారు.. ఇక ఇందులో జడ్జీలుగా శేఖర్ మాస్టర్, నాగబాబు యధావిధిగానే ఉన్నారు..ఇదివరకు యాంకర్ గా వర్షిని ఉండగా.. తప్పించి శ్రీముఖుని తీసుకువచ్చారు.. ఇప్పుడు ఆమెను కూడా తప్పించి దీపికాపిల్లి ని తీసుకురావడం జరిగింది. అయితే ఈసరి కొత్త యాంకర్ తో ఎంత వరకు ఈ షో ముందుకు వెళ్తుందో అనేది చూడాలి. మొత్తానికి జబర్దస్త్ నుంచి కమెడియన్స్ బయటికి వచ్చి.. కామెడీ స్టార్స్ లో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: