టీవీ:బిగ్ బాస్ బ్యూటీ హిమజ.. విడాకుల వార్తపై క్లారిటీ.!!
అలా ఇప్పటివరకు నాగచైతన్య- సమంత, ధనుష్- ఐశ్వర్య, దీప్తి సునయన- షణ్ముఖ్ ఇక వీరే కాకుండా ఎంతోమంది కూడా ఆ మధ్య బ్రేకప్ స్టోరీ లు పోస్ట్ చేసి విడిపోతున్నామని తెలియజేయడం జరిగింది.. అంతేకాకుండా ఈ సెలబ్రిటీస్ జోడీలు ముందుగా తమ ఇంస్టాగ్రామ్ లో తమ వాళ్లకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లను అన్ ఫాలో చేసి.. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బ్రేకప్ తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరొక నటి హిమజా కూడా తన భర్త ని ఫాలో చేయడం లేదని చెప్పడం తో ఇలాంటి విషయం మళ్ళీ బయటికి వచ్చింది.
నటి హిమజ తన భర్తతో త్వరలోనే బ్రేకప్ చెప్పబోతోంది అని వార్తలు బాగా వేగంగా మారుతున్నాయి.. వాస్తవానికి నటి హిమజకు వివాహమైందని విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇక ఈమె బిగ్ బాస్ లో కానీ.. మన యూట్యూబ్ ఛానల్ లో కానీ ఎప్పుడూ తన భర్త గురించి తెలియజేయలేదు. తరచూ తన పేరెంట్స్ ని మాత్రమే తెలియజేస్తూ ఉంటుంది.. తాజాగా కొద్దిరోజుల కిందట ఒక ఖరీదైన కారు కొన్న విషయాన్ని తెలియజేసింది.. ఇప్పుడు తన డూప్లెస్ హౌస్ నిర్మించుకుంటున్నానని తాజాగా ఒక వీడియో రూపంలో తెలియజేసింది. అది కూడా తన తల్లిదండ్రుల కోసం నిర్మిస్తున్నాను అని తెలియజేసింది.