టీవీ: తెలుగు సినిమా పరిశ్రమపైనే ఓటిటి అన్ని కోట్లు పెట్టుబడా..!!

Divya
ఇండియాలో ప్రస్తుతం కరోనా అనూహ్యంగా పెరగడంతో ఓటిటి బిజినెస్ అమాంతం పెరిగిపోయింది.. గడిచిన మూడు సంవత్సరాల క్రితం వరకు డిజిటల్ సినిమాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు.. కానీ ప్రస్తుత పరిస్థితులలో అనూహ్యంగా వీటి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. కరోనా పరిస్థితులలో థియేటర్లు మూసివేయడంతో.. అందరూ ఎక్కువగా డిజిటల్ ప్లాట్ ఫామ్ నే సినిమాలు చూసేందుకు ఎంచుకున్నారు. ఇక సినిమాల కోసం ఓటిటి సంస్థలలో కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తూ వెబ్ కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే పనిలో ఉన్నారు.


ఇక ప్రముఖ అమెజాన్, నెట్ ఫ్లెక్స్, ఆహ,zee-5 , హాట్ స్టార్ వంటి వాటి ఓ టీ టీ సంస్థలు ఎక్కువగా ఇప్పుడు పలు వెబ్ సిరీస్ లను నిర్మించే పనిలో బిజీగా ఉన్నాయి.. ఇక ఇలాంటి సమయంలోనే తెలుగులో కొన్ని చిత్రాలు కొనుగోలు చేయడం కూడా జరిగింది. ఇంకా కొన్ని సినిమాలు కొనుగోలు చేసేందుకు చాలా ఆసక్తి చూపుతున్నాయి ఓటిటి సంస్థలు. ఇక దీనితో ఇది వరకు రెండు కోట్లకు మాత్రమే ఓటీటీ బిజినెస్ జరిగేవి.. ఇప్పుడు ప్రస్తుతం రూ. 20 నుంచి 25 కోట్ల రూపాయలకు పైనే కొనుగోలు చేస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు.

కేవలం తెలుగులో అమెజాన్, నెట్ ఫ్లెక్స్, సోనీ లైవ్ వంటి ఖాతాదారులు చాలామంది ఉన్నారు. ఇక zee-5 వంటి పలు ఓటీటీ సంస్థలు అయితే ఏకంగా 100 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ గల సినిమాలను కొనుగోలు చేయడం జరుగుతోంది. ఇప్పటికీ rrr మూవీ కూడా కొనుగోలు చేసింది. ఇక తాజాగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా కొనుగోలు చేసేందుకు కొన్ని ఓటిటీ సంస్థలు చాలా సిద్ధంగా ఉన్నాయి. ఇక హిందీ సినిమాలను కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి పలు సంస్థలు. ఇక తెలుగు సినిమాలకి వెయ్యి కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతర భాషల సినిమా కి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: