ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా వెండితెర కంటే బుల్లితెర పైనే ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఒకప్పుడు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్స్ మాత్రమే వచ్చేవి.. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షో లు కూడా రావడంతో బుల్లితెరపై మరింత క్రేజ్ పెరిగింది.. ఇక అంతే కాకుండా బుల్లితెరపై నటించిన నటీ నటులకు మంచి క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు.. ప్రస్తుతం వెండితెరపై నటించే నటుల కంటే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ బుల్లితెర నటీమణులే సంపాదిస్తున్నారు. ఇక పారితోషికం విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ఉన్నారు బుల్లితెర నటీనటులు.
అందుచేతనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం బుల్లితెరపై సందడి చేయడానికి తెగ ఇష్టపడుతూ ఉంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే రెమ్యూనరేషన్ విషయంలో బుల్లితెర నటీనటులు చాలా తక్కువగా అందుకుంటారని అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా వాస్తవం కాదట.. ఎందుచేత అంటే ఒక సీరియల్ బాగా పాపులర్ అయిందంటే చాలు.. ఆ సీరియల్ లో నటించే నటీనటుల కు ఎక్కువ పారితోషకం ఆందుతూ ఉంటుంది. అలా ఇప్పుడు ఒక సీరియల్ నటి పారితోషికం విషయంలో బాగా దూసుకుపోతోందట. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ తెరపై నటిస్తున్న రూపాలీ గంగోలి.
ఈ నటి సారా భాయ్ వర్సెస్ సార్ అబ్బాయి అనే నాటికలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తరువాత అనుపమ అనే సీరియల్ లో నటించే అవకాశం దక్కించుకుందట. అటు తర్వాత ఈమె క్రేజ్ మరింత హైప్ పెరిగిందని చెప్పవచ్చు. ఈమె మొదట్లో ఒక్కో ఎపిసోడ్ కి 1.7 లక్షల రూపాయల పారితోషికం అందుకుంటుందట. ప్రస్తుతం ఈమె మూడు లక్షల రూపాయల వరకు అందుకుంటున్న ట్లు సమాచారం. ఇక దీంతో ఇండియాలో బుల్లితెరపై నటీనటులలో అత్యధికంగా పారితోషకం అందుకునే నటిగా మొదటి స్థానంలో ఉన్నది.