'షణ్ముఖ్ - దీప్తి' లను కలపడానికి రంగంలోకి యాంకర్ రవి?

VAMSI
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి అనుకుంటే చాలు ముందుగా గుర్తొచ్చేది షణ్ముక్ , సిరి లే సీజన్ 5 లో వీరిద్దరి రచ్చ మామూలుగా లేదు, అలాగే మర్చిపోయేలా కూడా లేదు. హౌజ్ లో హగ్ లతో, ఎమోషనల్ బాండింగ్ తో అబ్బబ్బ షో జరుగుతున్నంత సేపు వీరి గురించి విమర్శలే విమర్శలు. కానీ మాది ఫ్రెండ్షిప్ మాత్రమే అంటూ బ్యాండ్ వేసి మరి చెప్పుకున్నారు వీరు. అయితే అసలు... షో చూసిన వారెవరూ వీరిది ఒట్టి ఫ్రెండ్షిప్ మాత్రమే అంటే నమ్మరు. అలాగే సిరి పియాన్సి శ్రీహన్ కూడా అపార్థం చేసుకుని వీరు విడిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ అన్ని మనస్పర్థలు తొలగించుకుని మళ్ళీ ఒకటయ్యారు అని తెలుస్తోంది.

లేటెస్ట్ గా రవి ఫ్యామిలీతో  శ్రీహాన్, సిరిలు కలిసి ఫోటోలు దిగడంతో ఆ విషయం అర్దం అవుతోంది. సూపర్ హ్యాపీ టూ మీట్ యు బోత్ అంటూ రవి సతీమణి నిత్యా తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేశారు. శ్రీహాన్ కూడా ఈ రోజు చాలా ప్రత్యేకం
అన్నట్లుగా సోషల్ మీడియాలో సిరిని కలిసిన ఫోటోని షేర్ చేయడం విశేషం. అయితే వీరిని రవినే దగ్గరుండి కలిపాడని  అంతా అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ తన మరో ఫ్రెండ్ షణ్ముఖ్ లవ్ ట్రాక్ కూడా సెట్ చేయాలని దీప్తి సునైనాతో మాట్లాడాలని అనుకుంటున్నారట రవి. మరి రవి వలన దీప్తి సునయన షణ్ముఖ్ ల జంట కూడా తిరిగి ఒకటి అవుతుందేమో చూడాలి.

కానీ కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ తాము బ్రేక్ అప్ అయినట్లు ప్రకటించేశారు. మరి వీరు మళ్ళీ కలవాలి అన్నది ఫ్యాన్స్ కోరిక. ప్రేక్షకుల కోరికను యాంకర్ రవి తీరుస్తాడా అన్నది తెలియాలంటే ఇంకా కొని రోజుల వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: