టీవీ: ట్రోలర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇస్తున్న దేత్తడి హారిక..!!

Divya
యూట్యూబ్, పలువెబ్ సిరీస్ లో ,షార్ట్ ఫిలిమ్ లలో తనకంటూ ఒక మార్క్ ను చాటుకుంది దేత్తడి హారిక.. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా బాగానే పేరు సంపాదించుకుంది. బిగ్ బాస్ -4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న హారిక తను ఆ హౌస్ లోకి వెళ్లినందుకు తన పేరుకి తగ్గట్టుగా న్యాయం చేసిందని చెప్పవచ్చు.. బిగ్ బాస్ లో డిఫరెంట్ యాటిట్యూడ్ ని మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులను బాగానే అలరించింది ఈ భామ. అయితే ఈమెకు అందం, అభినయంతో పాటు అన్నిటినీ మించి అందాల ఆరబోత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.


అయితే ఈమె ఇలా ఎంత చేసినప్పటికీ కూడా వెండితెరపై రాణించలేక పోవడంతో మైనస్ గా మిగిలిపోయింది. అందుకు కారణం ఆమె హైట్ మైనస్ గా మరొక కారణమని చెప్పవచ్చు. అయితే ఈ విషయంపై కొంత మంది తరచూ ఆమెను ప్రస్తావిస్తూ ట్రోల్ చేయడం జరుగుతోందట. అందుచేతనే అలా  చేస్తున్నవారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక దేత్తడి హారిక ఏదైనా పోస్ట్ చేసింది అంటే చాలు.. ఆమె బాడీ షేవింగ్ పైన హైట్ పైనే ఎక్కువగా ప్రస్తావిస్తూ కామెంట్ చేయడం జరుగుతోందట. ఇక ఈ కామెంట్ల బెడద ఎక్కువగా ఉండడంతో వారందరికీ బుద్ధి చెప్పే విధంగా తన ఇంస్టాగ్రామ్ నుంచి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.
ఇక అలాంటి వారికి ఎన్టీఆర్ డైలాగ్ ని వాడి కామెంట్ చేసే వారందరి నోళ్లు ముగించేలా చేసింది. అయితే ఎన్టీఆర్ ని అన్నప్పుడు కూడా ఈ డైలాగ్ ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు అభిమానులు. అయితే ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా సినిమా సరిగా ఆడకపోయినా ఈ డైలాగు మాత్రం బాగా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. ఇక ఆ డైలాగ్ ని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా అంటూ.. వార్నింగ్ ఇచ్చింది.. ఇక ఈమె తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: