టీవీ: శతమానం భవతి సీరియల్ భానుమతి రియల్ లైఫ్ స్టోరీ..!!
భానుమతి తన అందం.. నటనతో మొదటిసారి ప్రేక్షకులను బాగా అలరించి.. మెప్పించడమే కాకుండా అభిమానులుగా కూడా మార్చుకుంది. భానుమతి అసలు పేరు శ్వేతా రెడ్డి.. ఈ శ్వేత రెడ్డి మన తెలుగమ్మాయి.. శ్వేతా రెడ్డి కి నటన అంటే చాలా ఇష్టం స్కూలింగ్ సమయంలోనే ఆమె ఏవైనా స్టేజీ షోలు ఇస్తూ తన స్నేహితులను బాగా మెప్పించేది..అంతేకాదు చదువుకునే సమయాలలో ఎన్నో ప్రోగ్రాములలో పాల్గొని తన నటనతో డాన్సులతో ప్రేక్షకులను బాగా అలరించింది శ్వేతారెడ్డి. ఇక శ్వేతా రెడ్డి కాలేజ్ లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో చాలా బాగా పాల్గొని అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేది..
నటి కావాలన్న ఆకాంక్ష తన లోని ప్రతిభను బయట పెట్టేలా చేసింది. ఇక యాక్టింగ్ మీద ఉన్న ఇష్టం తోనే తన నటనను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అంటే లఘు చిత్రాల ద్వారా తన కెరీర్ మొదలు పెట్టింది శ్వేతా రెడ్డి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షార్ట్ ఫిలింలో నటించింది . ఆ తర్వాత పైశాచికం.. గమనం వంటి ఇండిపెండెన్స్ సినిమాలలో కూడా నటించింది. ప్రస్తుతం శతమానం భవతి అనే సీరియల్ ద్వారా మొదటిసారి సీరియల్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇక్కడ కూడా తొలిసారి అయినప్పటికీ మంచి మార్కులను కొట్టేసింది అని చెప్పవచ్చు.