టీవీ: రోజా షో లోకి వచ్చి.. ఆమె పైన కామెంట్స్ చేసిన ఆమని..!!

Divya
రోజా సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా. జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ వంటి వాటికి కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.. తాజాగా ఈ నెల 25వ తేదీన ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ సంబంధించి ఒక ప్రోమో కూడా విడుదలవ్వడం జరిగింది.. అందులో అతిథిగా ఆమని హాజరు కావడం జరిగింది.. ఇక ప్రోమోలో చూపించిన విధంగా శుభలగ్నం సినిమా తోనే రోజా ఆమని ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది.

ఇక శుభలగ్నం మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్టు అయ్యిందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఇందులో రోజా, ఆమని ఇద్దరి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత రష్మి మాట్లాడుతూ.. శుభలగ్నం మూవీలో లాగా రోజా, ఆమనిలకు అసలు పడలేదు కదా.. మరి ఇక్కడ కూడా ఇదే కంటిన్యూ చేస్తారా అని అడిగింది.. అయితే ఈ విషయంపై ఆమని మాట్లాడుతూ ఇప్పుడైతే నాకు ఆటువంటి సమస్య లేదు.. రో* భర్త రో* తోనే ఉన్నారు. నా భర్త నాతోనే ఉన్నారు అంటు.. ఆమ* షాకింగ్ కామెంట్ తెలియజేసి. ఇక ఇందులో జడ్జిగా మనో బదులు ఆమని హాజరు కావడం జరిగింది.
ఇక అలాగే ఇందులో ఇమాన్యుయేల్ ఆటో డ్రైవర్ గా ఎంట్రీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ వర్ష కూడా విభిన్నమైన గెటప్లలో తో ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక వీరిద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను ఈ వీడియో ప్రోమోలో  చూపించారు. ఇక ఆ తర్వాత ఫైమా ఎంట్రీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఫైవ్ మాపై ఇమ్మానియేల్ పంచుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించి ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతుంది. ఏదిఏమైనా ఈసారి ఎక్స్ ట్రా జబర్దస్త్ తో ప్రేక్షకులను బాగానే అలరిస్తారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: