టీవీ : గీత గోవిందం సీరియల్ గీత రియల్ లైఫ్ స్టోరీ..!!
ఇక ఈ సీరియల్ లో గీత పాత్రలో నటిస్తున్న హీరోయిన్ గురించి మనం పూర్తి విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన మౌనరాగం సీరియల్ లో పూజా పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస అవకాశాలు అందుకోవడం గమనార్హం. గీత అసలు పేరు అంతరా స్వర్ణాగర్. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కోల్ కత్తాలో ఫిబ్రవరి ఆరో తేదీన జన్మించింది. బెంగాలీ అమ్మాయి అయిన అంతరా కు ఒక బ్రదర్ కూడా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కల్యాణిలో అంతరా తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఈ పిల్లి కళ్ళు సుందరికీ చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి .. మోడలింగ్ అంటే పిచ్చి.. ఆ కారణంతోనే మొదట మోడలింగ్లో అడుగుపెట్టి .. ఆ తర్వాత నటిగా అవతారం ఎత్తింది.. పలు యాడ్స్ తో పాటు వెబ్ ఫిలిం లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఒక మంచి డాన్సర్ కూడా. సీరియల్స్ లోకి రాకముందు మోడలింగ్ రంగంలో ఎంతో మంచి పేరు వచ్చింది.. ఆ కారణంతోనే మొదటి సారి అది కూడా తెలుగు బుల్లితెరపై అడుగులు వేసింది. మౌనరాగం సీరియల్ తో మొదలైన ఈమె కెరియర్ మొదలై ఆ తరువాత వెండి తెరపై కూడా ఈమె నటించింది బ్రిలియంట్ బాబు అనే సినిమాలో కూడా నటించడం గమనార్హం. ఇక ప్రస్తుతం గీత గోవిందం సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తోంది ఈ ముద్దుగుమ్మ