టీవి:విష్ణు ప్రియపై షాకింగ్ కామెంట్స్ చేసిన ముక్కు అవినాష్..!!
అందుచేతనే అవినాష్ ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమయ్యే కొన్ని షోలలో మాత్రమే కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన కామెడీ స్టార్స్ ప్రోమోలో.. ముక్కు అవినాష్ తన వివాహానికి సంబంధించి ఒక స్కిట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అది వైరల్ గా మారుతోంది. ఇక స్కిట్ లో భాగంగానే.. తన వివాహానికి ఎవరెవరిని పిలువ లేదో వారి అందరికోసం మళ్ళీ వివాహం చేసుకుంటానని అవినాష్ తెలియజేశారు. ఇక ఆ తర్వాత పెళ్లికి వచ్చిన వారందరూ రీల్ చేస్తామని చెప్పగా అవినాష్ సీరియస్ కావడం జరిగింది.
ఇక తన వివాహానికి వచ్చి.. వ్లాగ్ చేయడానికి నువ్వు ఎవరు అంటూ విష్ణు ప్రియ పై షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇక విష్ణుప్రియ అక్కడ లేకపోయినప్పటికీ కూడా అవినాష్ విష్ణు ప్రియ పేరును ప్రస్తావించడం జరిగింది. ఇక తన పెళ్ళికి తను వ్లాగ్ పెట్టుకుంటే వ్యూస్, సబ్ స్కైబర్లు వస్తారని తను భావించాడట. కానీ విష్ణుప్రియ మొత్తానికి అంతా చెడగొట్టింది అవినాష్ తెలియజేశాడు. దీంతో తన వీడియో ని ఎవరు చూడలేదు అంటే అవినాష్ తన బాధను తెలియజేశాడు. ఈ స్కిట్ ఈ ఆదివారం ప్రసారం కానుంది.