టీవీ: జబర్దస్త్ కమెడియన్ కన్నీటి కష్టాలు తెలిస్తే షాక్..!!

Divya
పటాస్ షో ద్వారా ఎవరు ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు కమెడియన్ ప్రవీణ్. ఇక ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో తన తండ్రిని స్టేజ్ పైకి తీసుకువచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన ఈరోజు ఈ స్టేజ్లో నిలబడ్డానికి తన తండ్రి కారణమని ప్రవీణ్ తెలిపారు. ఇక తన తల్లి తొమ్మిది సంవత్సరాల వయసులోనే మరణించింది అని తెలియజేశారు.

ఇక తన అమ్మ చనిపోయిన తరువాత తన తండ్రి మరొక పెళ్లి చేసుకోలేదని ప్రవీణ్ తెలియజేశారు. తన తండ్రి లేకపోతే తాము లేమని.. తనకు తండ్రి అయినా తల్లి అయినా అన్నీ తానే అయ్యి చూసుకున్నారని ప్రవీణ్ ఎంతో ఎమోషనల్ గా  తెలిపారు. తండ్రి మాత్రమే తనకు పెద్ద ఆస్తిపాస్తులు అని తెలిపారు. తన తల్లి ఒక కాలేయ సంబంధిత వ్యాధితో మరణించిందని.. ఆమెను ఎన్నిసార్లు హాస్పిటల్ చుట్టూ తిప్పినా కూడా ఫలితం లేకపోయిందని తెలిపారు. తన సోదరుడు వెటర్నరీ చదివినప్పటికీ ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ విడిపోవడం వల్ల అతనికి ఉద్యోగం రాలేదని తెలియజేశాడు ప్రవీణ్. ఇక చెల్లెలు కూతురు తో పెద్ద కొడుకుకి వివాహం అయిందని తెలిపారు. ప్రవీణ్ తండ్రి..

తన తండ్రి కి తన కోడలి కడుపులో తన భార్య పుడుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు.. ప్రవీణ్ హైదరాబాద్ కు వచ్చే సమయంలో తన ఖర్చులకోసం అని తన తండ్రి డబ్బు అడగడానికి వెళితే వారు అవమానించడం తో తను పురుగుల మందు తాగాలనుకున్నారని ప్రవీణ్ తెలిపారు. ప్రవీణ్ తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఈ షో ద్వారా తెలియజేశారు. తన తండ్రి మొదటిసారిగా ఈ షోకి తీసుకువచ్చినందుకు మల్లెమాల సంస్థ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రవీణ్. ఈ విషయాలు తెలుసుకున్న కొంతమంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: