"సుధీర్ - రష్మీ"లు నిజ జీవితంలో ఒక్కటవుతారా... ?
అయితే రీసెంట్ గా హోలీ సంబరాల్లో భాగంగా స్టార్ మా ఛానల్ లో ఒక షోలో భాగమైన ఈ జంట. స్టేజ్ పై తమ తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంది. ఆ షోకి యాంకర్ గా వ్యవహరించిన రవి, యాంకర్ రేష్మి ని మీరు సుదీర్ గురించి ఏమైనా చెప్పాలి అంటే ముందుగా ఏమి చెప్తారు అని అడుగగా.... అపుడు రేష్మి మేము కలిసిన ఈ 10 సంవత్సరాలలో ఒకసారి మా మధ్య చిన్న మిస్స్ అండర్స్టాండింగ్ జరిగింది. దాంతో ఇద్దరం రెండు రోజులు అస్సలు మాట్లాడుకోలేదు. కానీ ఆ తర్వాత సుదీర్ నేను సెట్ లో ఉన్న సమయంలో నాకు నచ్చిన స్వీట్ పంపించి మరీ మళ్ళీ నాతో మాట్లాడాడు, అది నాకు ఒక తియ్యటి జ్ఞాపకం అనే చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది.
ఇక వీరిద్దరు స్టేజి పై తమ మాటలతో, కవ్వింతలతో ప్రేక్షకులను బాగా అలరించారు. సుడిగాలి సుదీర్ గురించి వేరే చెప్పాలా రేష్మి ని, తన అందాన్ని పొగుడుతూ ఆమెను చూస్తూ ఈ లోకాన్నే మరిచిపోయినట్లుగా సంతోషాన్ని వ్యక్తం చేశాడు.