బుల్లితెరపై ఫిమేల్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో గ్లామర్
బ్యూటీ శ్రీముఖి కూడా ఒకరు.
టాలీవుడ్ లో ప్రతి ఒక్క ప్రేక్షకులకు సుపరిచితమే. తన మాటలతో, చేసే అల్లర్లతో ఎంతోమందిని బాగా ఆకట్టుకుంటూ అభిమానులను మూటకట్టుకుంది.
శ్రీముఖి ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకర్ గా చేసింది. ఇక వెండితెరపై కూడా పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఈమె ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్గానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది.
శ్రీముఖి మొదటిసారి
అదుర్స్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తనకి మంచి పేరు రావడంతో ఆ తర్వాత
పటాస్ షో కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ షోలో
శ్రీముఖి బాగా యాక్టివ్గా ఎనర్జిటిక్గా చేయడంతో మంచి పేరు సంపాదించుకున్నది.
శ్రీముఖి ఎటువంటి షో చేసిన సరే తన హవాని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే
బిగ్ బాస్ లో కూడా పాల్గొని చివరి వరకు ఆటలు కొనసాగి రన్నర్ గా గెలిచింది.
బిగ్ బాస్ ద్వారా క్రేజ్ పెరగడంతో ఈమెకు పలు
సినిమా అవకాశాలలో నటించేందుకు సిద్ధమైంది. కానీ అనుకున్నంత స్థాయిలో కాబట్టి లేకపోవడంతో తిరిగి యాంకర్ గా తన కెరియర్ ని ఎదవిదిగా కొనసాగిస్తున్నది.
అయితే తాజాగా
శ్రీముఖి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.
శ్రీముఖి అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక వీడియో ని షేర్ చేసింది శ్రీముఖి. అందులో ఒక వ్యక్తికి ఐలవ్యూ అని కూడా తెలియజేసింది. ఇంతకు ఆ వీడియోలో ఏమున్నదంటే.. ఒక
ఈవెంట్ లో శ్రీముఖి.. సాకేత్ అనే వ్యక్తికి ఏదో తినిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి వీడియోను కూడా షేర్ చేయగా. ఆ వీడియో ని చూస్తూ బాగా నవ్వుకోవడంతో ఐ
లవ్ యు
రా అంటూ సింబల్ తో షేర్ చేసింది