టీవీ: నాగబాబు ముక్కు అవినాష్ కు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం..!!
ఇకపోతే తాజాగా అవినాష్ వివాహం చేసుకున్నారు. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక పలు వీడియోలను కూడా విడుదల చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముక్కు అవినాష్ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్‌బై చెప్పడానికి ముఖ్యకారణం నాగబాబు అంటూ పలు వార్తలు కూడా వచ్చాయి. ఆయన చెప్పడం వల్ల కొంత మంది కమెడియన్స్ ఈ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చారని వార్తలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే ముక్కు అవినాష్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో పాల్గొనడం జరిగింది అందులో జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటికి రావడానికి ముఖ్య కారణం కూడా తెలియజేశారు.
జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి నాగబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఆయన ఎప్పుడూ కూడా జబర్దస్త్ కార్యక్రమం లో మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు తప్ప కార్యక్రమం నుండి బయటకు రావాలని చెప్పలేదట. కేవలం మాకు ఒక తండ్రిలా ప్రతి ఒక్క విషయంలో గైడ్ గా ఉన్నాడని తెలియజేశారు అవినాష్. జబర్దస్త్ లో ఉన్న సమయంలో స్కిట్ లో ఏదైనా తప్పు చేస్తే రూమ్ కి పిలిచి మళ్ళీ వార్నింగ్ ఇచ్చే వారట. తమ కోసం ఎప్పుడూ ఆయన మంచి సలహాలను ఇచ్చేవారని అవినాష్ తెలియజేశారు. దీంతో జబర్దస్త్ షో విడిపోవడానికి కారణం నాగబాబు కాదని తేల్చి చెప్పారు.