టీవీ: బిగ్ బాస్ సీజన్ -6 ప్రోమో వీడియో వైరల్..!!

Divya
బుల్లితెర ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతూ రియాల్టీషో గా పేరు పొందింది బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో ప్రస్తుతం దూసుకుపోతున్న రియాలిటీ షో అని చెప్పవచ్చు. ఈ షో తెలుగు లో కేవలం ఐదు సీజన్లలో మాత్రమే పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల కాలంలో ఈ షో ని ఒటిటి లో కూడా ప్రారంభించారు దీనికి మంచి రెస్పాన్స్ లభించడంతో మరికొద్ది రోజుల్లోనే బిగ్ బాస్-6 కూడా ప్రారంభం కానుంది. ఇందులో పలువురు కంటెస్టెంట్ లు కూడా పాల్గొన్న పోతున్నారు. అయితే ఈ షో కి సమంత హోస్ట్గా వ్యవహరిస్తోందని వార్తలు కూడా వినిపించాయి కానీ తాజాగా ఈ ప్రోమో తో మొత్తం అందరికీ చెక్ పెట్టాడు నాగార్జున.
బిగ్ బాస్ -3 నుంచి ఈ షోకు నాగార్జున హోస్టు గా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆరో సీజన్ కూడా ఈయన హోస్ట్ గా ఉన్నారు. అందుకు సంబంధించి తాజా ప్రోమో లో నాగార్జున ఎంట్రీ సీన్ ని చూపించడం జరిగింది. గ్రాండ్ ఓపెనింగ్ అంటూ ప్రోమో ను విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ గా మారుతుంది. అయితే ఇందులోని కంటెస్టెంట్ ల పేర్లు కూడా పలు రకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు సంబంధించి ఒక లిస్ట్ కూడా వైరల్ గా మారుతోంది.
ఇందులో పలువురు యూట్యూబర్స్, సోషల్ మీడియా సెలబ్రిటీస్, టీవీ సీరియల్ ఆర్టిస్ట్  వారిని ఎంపిక చేశారనే విషయం వినిపిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న యాంకర్ శివ, మిత్రశర్మ , ఆర్జే చైతు వీరిలో ఎవరో ఒకరు ఈ సీజన్లో ఉండబోతున్న ట్లు గా సమాచారం. హీరోయిన్స్ సంజనా చౌదరి, మరొక హీరోయిన్ ఆషా సైని, మరొక యూట్యూబ్ కుషి త కళ్ళకు, యాంకర్ మంజూష, జబర్దస్త్ వర్ష, తదితరులు ఇందులో ఉండబోతున్న ట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: