ఆ బిగ్ బాస్ బ్యూటీ ప్రేమలో యాంకర్ శివ ?
ఇదిలా ఉండగా అదే బిగ్ బాస్ హౌజ్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ శివ అరీయాన తో హౌజ్ లోనే చాలా చనువుగా ఉండేవాడు. ఇక బయటకు వచ్చాక క్లోజ్ నెస్ మరింత పెరిగింది. వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అన్నది బయట టాక్. ఇక ఇపుడేమో తాజాగా సోషల్ మీడియాలో అరియానా తన అభిమానులతో చిట్ చాట్ చేస్తుండగా మధ్యలో యాంకర్ శివ వచ్చి ఫ్రీగా ఉన్నావా, ఉంటే బయటకు పోదాం అని అడిగేశాడు. అందుకు అరియాన ఎక్కడకు పోదాంరా అని అంది. ఈ విషయాన్ని స్వయంగా అరియానా నే బయట పెట్టింది. దాంతో వీరి మద్య కచ్చితంగా ట్రాక్ నడుస్తోంది అంటూ గుసగుసలాడేస్తున్నారు.
అయితే గతం లో అరియనా మరియు ముక్కు అవినాష్ మద్య కూడా లవ ట్రాక్ నడుస్తోంది అని వార్తలు వెల్లువెత్తాయి కానీ కట్ చేస్తే అవినాష్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే.