టీవీ: సుమకి పోటీగా వస్తున్న బిత్తిరి సత్తి కారణం..!!

Divya
ఇటీవల సినిమాల ప్రమోషన్ అనేది చాలా కామన్ పాయింట్ గా మారిపోయింది. ఇక ఏదైనా కొత్త సినిమా వస్తోందంటే చాలు పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి సినిమా విడుదల అయ్యేవరకు అన్నిటికి ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ఇక సినిమాలకు ముందు ప్రమోషన్ ఇంటర్వ్యూలో అయితే కచ్చితంగా పాల్గొంటూ ఉంటారు నటీనటులు. ఇక అంతే కాకుండా అభిమానులతో యూట్యూబ్ ప్రమోషన్స్ తో పలు రీల్స్ చేస్తూ ఉంటారు.


ఎన్నో ఏళ్ల నుంచి సినిమాలకు ముందు ప్రమోషన్ లు,  ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా కామన్ గానే మారిపోయింది. దాదాపుగా అన్ని ఇంటర్వ్యూస్ చేయడానికి కచ్చితంగా యాంకర్స్ ఉండాల్సిందే. అయితే ఇలాంటి వాటికి ఇప్పుడు పుల్ స్టాప్ పడేలా ఉంది..అంతా బిత్తిరి సత్తి వల్లే. సుమకి డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల వేరే యాంకర్స్ కి అవకాశం ఇస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఎందుచేత అంటే సుమ ఉన్నా.. లేకపోయినా కూడా ప్రమోషన్స్ ఇంటర్వ్యూకి చేయడానికి బిత్తిరి సత్తి కావాలి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.


తాజాగా సర్కారు వారి పాట, పక్కా కమర్షియల్, rrr తదితర సినిమాలకు కూడా బిత్తిరి సత్తి ప్రమోషన్ ద్వారానే విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. బిత్తిరి సత్తి అడిగే ప్రశ్నలు ఇంటర్వ్యూ ని హైలైట్ గా చేస్తూ ఉంటాయి. సర్కార్ వారి పాట చిత్ర సమయంలో మహేష్ బాబుతో జరిగిన ఇంటర్వ్యూ తో మరింత హైప్ ను  తెచ్చుకున్నాడు. ఇక ఈయన మాటలకు మహేష్ బాబు అయితే పడి పడి నవ్వడం చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. ఇక ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలు తమ సినిమా ప్రమోషన్ల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ బిత్తిరి సత్తి కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతం బిత్తిరి సత్తి ఒక్కో ఇంటర్వ్యూకి ఏకంగా రూ.1.60 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: