టీవీ: మాస్ డాన్స్ తో అదరపడుతున్న జబర్దస్త్ నరేష్.. వీడియో వైరల్..!!

Divya

జబర్దస్త్  ప్రేక్షకులకు నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. చూడడానికి చాలా పొట్టిగా ఉన్నప్పటికీ తన పంచులతో అందరిని బాగా నవ్విస్తూ ఉంటారు. జబర్దస్త్ కు వచ్చిన అతి తక్కువ సమయంలోనే బాగా పేరు సంపాదించుకున్నాడు నరేష్. మొదట చంటి టీమ్ లో ఉన్న నరేష్ ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి చేరాడు. పొట్టి నరేష్ వల్లే తన టీంకు మంచి పేరు వచ్చిందని భాస్కర్ పలుసార్లు కూడా తెలియజేయడం జరిగింది. ఇక నరేష్ పంచులతోనే కాదు అప్పుడప్పుడు తన డాన్స్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ క్రోమోలు నరేష్ డాన్స్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కు సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదలవడం జరిగింది. ఈ ప్రోమో లో మొదట కమెడియన్ కృష్ణ భగవాన్ కూడా తన పంచులతో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు. ఆ తర్వాత హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ ఆటో రాంప్రసాద్ తమ కామెడీ పంచలతో బాగా ఆకట్టుకున్నారు. అయితే క్రోమోలో ఇవన్నీ ఒకే వైపు ఉంటే నరేష్ డాన్స్ షో మాత్రం ఈ షో కి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది.

రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలలోని బంగారు కోడిపెట్ట సాంగ్కు నరేష్ డాన్స్ వేయడంతో పాటు డాన్స్ తో దుమ్ము లేపాడని చెప్పవచ్చు.. నరేష్ మాస్ డాన్స్ చేసిన అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఇక రష్మీ కంటెంట్ ఉన్నవారికి కటౌట్ అవసరం లేదంటూ నరేష్ ని పొగిడేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతున్నది. ఏదిఏమైనా కమెడియన్ నరేష్ మరొకసారి తన లో ఉండే టాలెంట్ను మరొకసారి బయట పెట్టాడని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: