టీవీ: రష్మీ ని అవమానించిన హైపర్ ఆది.. కట్ చేస్తే..!!

Divya
హైపర్ ఆది.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హైపర్ ఆది తన నటనతోనే కాదు కామెడీ తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇక కేవలం జబర్దస్త్ ద్వారానే కాదు సినిమాలు, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో కూడా కంటెస్టెంట్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అదిరే అభి టీం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆది అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకొని జడ్జిలపైనే కామెంట్లు చేసే స్థాయికి ఎదిగిపోయాడు అంటే ఇక ఆయన కామెడీకి ప్రేక్షకులు ఎంతలా పట్టం కట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రష్మీ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రష్మి సినిమాలలో కూడా నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది.
గతంలో హైపర్ ఆది.. రష్మీనీ అవమానించడంతో ఆమె గుర్తు పెట్టుకొని మరి రివేంజ్ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో రష్మీ మాట్లాడుతూ కొత్త టాస్క్ మీ ముందుకు తీసుకొస్తున్నాం.. ఇందులో కొంతమంది ఫోటోలను ఉంచ బోతున్నాము అందులో మీకు నచ్చని వారి ఫోటోలు కారణం చెప్పి తగలబెట్టడం లేదా ముక్కలు చేయడం లాంటివి చేయండి అంటూ ఆమె చెప్పింది. దీంతో రాంప్రసాద్ అక్కడికి వచ్చి ఒక విషయంలో హైపర్ ఆది నాకు నచ్చలేదు అంటూ ఆది ఫోటోను తగలబెట్టేసాడు.

ఇక పరదేశి కూడా అన్ని ఆది అన్నే నాకు.. కానీ ఒక విషయంలో మాత్రం నచ్చలేదు అంటూ ఆది ఫోటోను ముక్కలు చేశాడు. ఇక రష్మీ కూడా హైపర్ ఆది ఫోటోను ముక్కలు చేయడం జరిగింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి యాంకర్ గా సుదీర్ తప్పుకోవడంతో ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి రష్మీ వచ్చినప్పుడు.. ఓహ్ రష్మీ ఎప్పుడొచ్చావు అని అడగకుండా.. ఎప్పుడు వెళ్తావని అడిగి నన్ను అవమానించాడు అందుకు నేను ఆది ఫోటోను ముక్కలు చేశాను అంటూ ఆమె సమాధానం కూడా చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: