బిగ్ బాస్ 6: నాగార్జున రెమ్యూనరేషన్ పై చర్చ... మరీ అన్ని కోట్లా ?
కానీ లిస్ట్ లో ఉంది వీరే అని ఒక పక్కా సమాచారం అయితే లేదు. కానీ వాస్తవంగా కంటెస్టెంట్ లు ఎవరు అనేది తెలియాలంటే షో స్టార్ట్ అయ్యే రోజు వరకు ఎదురుచూడాల్సిందే. కాగా ఇప్పుడు ఈ షో కు సంబంధించిన మరొక విషయం చర్చకు దారి తీస్తోంది. ఈ షో కు కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. అయితే హోస్ట్ గా చేయడానికి నాగార్జున ఈసారి తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశారు అని తెలుస్తోంది. గత సీజన్ కు నాగార్జున 12 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకోగా, ఈ సీజన్ కు మాత్రం ఏకంగా మూడు కోట్లు పెంచి 15 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా ఇప్పుడు ఈ రెమ్యూనరేషన్ మీద టాలీవుడ్ అంతటా పెద్ద చర్చ అవుతోంది. వారంలో రెండు రోజుల పాటు హోస్ట్ చేయడానికి అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇదే నిజమైన రెమ్యూనరేషన్ ఆ లేదా కేవలం గాసిప్ అన్న వాస్తవం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.