టీవీ: జబర్దస్త్ రోహిణి.. బ్రేకప్ లవ్ స్టోరీ ఎవరితోనో తెలుసా..?
ఇక ఆ మధ్య జబర్దస్త్ షోలో అయితే ఈమెకు ప్రత్యేకంగా ఒక టీం కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో కొన్ని స్కిట్లు టీమ్ లీడర్ గా కూడా వ్యవహరించింది. కానీ అంతగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. ఇక రోహిణి ఎక్కువగా హైపర్ ఆది రాంప్రసాద్ ఇద్దరిపై కౌంటర్ వేస్తే ఉంటుంది. ఇక ఈమె లావుగా ఉందని కొంతమంది అందగహీనంగా ఉందని సెటైర్లు వేస్తూ ఉంటారు. కానీ రోహిణి మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా చాలా బిజీగా ఉంటుంది.
ఎప్పుడూ అందరినీ సరదాగా నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రోహిణి. ఈమె తన యూట్యూబ్ ఛానల్స్ లో పలు రకాల వీడియోలను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా జీ తెలుగులో ఒక ఈవెంట్లో ఈమె తాజగా కనిపించడం జరిగింది.. మన ఊరి రంగస్థలం అంటూ జరుగుతున్న ఒక ఈవెంట్లో ఈమె తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి తెలియజేసినట్లు తెలుస్తోంది. ఒకరిని చాలా డీప్ గా రోహిణి లవ్ చేసినట్లు తెలిపింది అతను కూడా ఆమెను బాగానే లవ్ చేశాడట కానీ అలా ఆరు నెలల తర్వాత తనకు అసలు విషయం తెలిసిందని తెలిపింది అతడికి ఇది వరకే వేరే అమ్మాయితో లవ్ ఎఫైర్ ఉందని దాంతో నేను మోసపోయానని చెప్పుకొచ్చింది రోహిణి.