టీవీ: చలాకీ చంటి జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ వెళ్లడానికి కారణం..!!

Divya
నటుడు,కమెడియన్ గా చలాకి చంటి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ -6 లో పాల్గొనడం జరిగింది. అయితే జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యూట్యూబ్ ఛానల్ కి బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వకముందే చలాకి చంటి పలు ఆడియన్స్ తో మంచి గుర్తింపు సంపాదించారు. అంతేకాకుండా తనను జబర్దస్త్ నుంచి బయటికి పంపించే కుట్ర ను కూడా తెలియజేయడం జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నానని.. నాగార్జున తన నోటి నుంచి చంటి అనే పేరు వినాలని చాలా రోజుల నుంచి ఆశిస్తున్నాను తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తనకు సపోర్ట్ చేయవలసిందిగా కోరారు. బిగ్ బాస్ లోకి వచ్చేముందు మల్లెమాలలో జరిగిన విషయాలను కూడా తెలియజేశారు.

మల్లెమాల షోలో తనకి ఒక అవమానం జరిగింది అని వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోలేదని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే చాలా దారుణంగా సమాధానాలు ఇచ్చారని తెలిపారు. నీ టాలెంట్ కు ఇదే ఎక్కువని తనను అని చాలా బాధ పెట్టారని తెలియజేశారు. తన ముక్కుసూటి మనిషినని ఎలాంటి చోట అయినా సరే తప్పు జరిగితే వెంటనే ప్రశ్నిస్తానని.. అందుచేతనే తనకి పొగరు, కోపిష్టి అని ముద్ర వేశారని తెలియజేశారు. అలా తనని జబర్దస్త్ నుంచి వెళ్లగొట్టడానికి పలు ప్రయత్నాలు చేశారని తెలిపారు. ఇక నాగబాబు గురించి తెలియజేస్తూ జబర్దస్త్ లో పనిచేసే వారందరికీ ఆయన దగ్గరగానే ఉంటారని తెలిపారు ఆయన ఆఫీస్ దగ్గరకు ప్రతి ఒక్కరూ వెళ్లేవారని తెలిపింది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన చంటి ఎంటర్టైన్మెంట్ చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: