బిగ్ బాస్ 6: జబర్దస్త్ ఫైమా డేంజర్ లో ఉందా ?

VAMSI
బిగ్ బాస్ 6 మొదలై మొదటి వారం కొనసాగుతోంది. హౌస్ లోకి ఎంటర్ అయిన 21 మంది సభ్యులు ఒకరితో ఒకరు మింగిల్ అవడానికి టైం తీసుకుంటున్నారు. ఈ ప్రయాణంలో అనర్ధాలు, అపార్దాలు, మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఓటింగ్ జరిగింది. ఈ వారం ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిన వారిలో సింగర్ రేవంత్, జబర్దస్త్ కమెడియన్ చంటి, జబర్దస్త్ నటి ఫైమా, ఆరోహి, అభినయశ్రీ మరియు ఇనయ సుల్తానా లు ఉన్నారు. అయితే వీరి ఎలిమినేట్ చేయడానికి చెప్పిన కారణాలు అనీ కూడా చాలా సిల్లిగా ఉంటాయి. అయినా బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం నామినేషన్ అంగీకరించాల్సిందే.

అయితే ఈ ఆరు మందిలో ఈ మూడు రోజులు గమనించిన దానిని బట్టి చూస్తే రేవంత్, చంటిలు చాలా సాలిడ్ గా తాము ఏమనుకుంటున్నారో తెలియచేస్తూ ముందుకు వెళుతున్నారు. వీరికి ఇతరులను కమాండ్ చేసే లక్షణాలు ఉన్నాయి. కన్విన్స్ చేసే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సేఫ్ అవుతారు అన్నది పక్కా. అభినయ శ్రీ సీనియర్ నటి కావడం వలన తనుకున్న ఫాలోయింగ్ కి ఓట్లు పడుతాయి, తద్వారా ఆమె కూడా సేఫ్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా పల్లెటూరు నుండి హైదరాబాద్ కు వచ్చి డెవలప్ అయిన ఆరోహి సైతం తనలా ఉంటూ ప్రేక్షకుల్లో బలంగా ముద్ర వేసుకుంది .

కాబట్టి ఈ వారం ఫైమా డేంజర్ జోన్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అపుడప్పుడు సడెన్ గా డల్ గా అయిపోవడం, అలెగేషన్స్ ను స్పోర్టివ్ గా తీసుకోలేకపోవడం వంటి కొన్ని కారణాలతో మిగిలిన వారి కంటే బలహీనంగా కనిపిస్తోంది. సో ఈమె ఈ వారం ఇంటి నుండి వెళ్లినా ఆశ్చర్యపడనక్కర్లేదు.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: