టీవీ: ఉదయభాను కెరియర్ నాశనం అవ్వడానికి కారణం..?

Divya
తెలుగు బుల్లితెర ప్రారంభమవుతున్న రోజులలో యాంకర్ గా గుర్తింపు సంపాదించుకుంది ఉదయభాను.. ఈమె అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయినప్పటికీ ఆ తరువాత సుమ యాంకర్ గా ఎప్పుడు అయితే అడుగుపెట్టిందో ఆ తర్వాత ఈమెకు అవకాశాలు చాలానే తగ్గిపోయాయి. ఇక అప్పట్లో కూడా ఉదయభాను అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాంకర్ గా పేర్కొంది. అయితే ఉదయభాను కెరియర్ అంతా సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో ఆమె జోరు ఉన్నపలంగా తగ్గిపోయింది. అయితే అందుకు కారణం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం

ఉదయభాను పెళ్లి ఒక మిస్టరీగానే ప్రేక్షకులలో మిగిలిపోయింది.  ఇప్పటికీ కూడా ఈ పెళ్లిపై పలు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఉదయభాను టీవీలో ఎంట్రీ కాకముందే 15 సంవత్సరాలకే ఒక ముస్లిం వ్యక్తితో వివాహం జరిగిందట.  అయితే కొన్ని కారణాలవల్ల అతడి నుండి విడిపోయి ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తున్నది. అలా ఉదయభాను కెరియర్ లో ఇదొక మచ్చగా మిగిలిపోయింది. ఇక అటు తరువాత కెరియర్ పరంగా దూసుకు వెళ్తున్న సమయంలో విజయ్ కుమార్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది.. అయితే విజయ్ మొదట ఉదయభాను కి కార్ డ్రైవర్గా, ఆఫీసులో పనిచేసేవారని పలు రకాలుగా వార్తలు వినిపించాయి . అయితే తను మాత్రం ఏం చేస్తాడో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి. అయితే ఈ వ్యక్తితో వివాహం కోసం ఉదయభాను తమ తల్లిదండ్రులతో కూడా గొడవ పడినట్లు సమాచారం.

అలాంటి గొడవలు కారణంగానే ఉదయభాను కెరియర్ కాస్త గందరగోళానికి గురైందని వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆమె సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు ఉదయభాను ప్రేమ వ్యవహారం కారణంగానే బుల్లితెరపై అంతగా తన జోరు చూపించలేకపోతోంది అని సమాచారం. ఉదయభాను నిర్ణయం సరైనది అయినప్పటికీ ఆ సమయంలో ఆమె తల్లి ఆమెకు మద్దతు చెప్పకపోవడం వల్ల ఆమె కెరియర్ ఇలా ఒడిదుడుకులైందని కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఉదయ భాను కి ఇద్దరు పిల్లలు. ఉదయభాను , విజయకుమార్ ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: