టీవీ: బిగ్ బాస్ ద్వారా చంటి సంపాదించింది అంతేనా..?
ముఖ్యంగా ఊహించని కంటిస్టెంట్లు కాకుండా వేరే వాళ్ళు ఎలిమెంట్ అవుతూ ఉండడంతో ప్రేక్షకులకు కూడా మరింత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే నేహా ఎలిమెంట్ కావడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.ఇక బిగ్ బాస్ లో వెళ్లిన వారిలో బాగా ఫేమస్ అయిన చలాకి చంటి కూడా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడంతో మరింత అభిమానులకు షాక్కు గురిచేస్తోంది. చంటి గతంలో ఎన్నో సినిమాలలో నటించాడు అంతేకాకుండా జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా కూడా పేరు సంపాదించారు. అలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చంటి చివరకు బిగ్ బాస్ విన్నర్ అవుతారని అభిమానులను ప్రేక్షకులు ఊహించని విధంగా ఎలిమినేట్ కావడం జరిగింది.
దీంతో చంటి ఇన్ని రోజులు హౌస్ లో ఉన్నందుకు ఎంత సంపాదించాడనే విషయం ఇప్పుడు అభిమానులలో ప్రశ్నగా మిగిలింది. అయితే తాజా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ లో చంటి రూ.4 లక్షల రూపాయలు ఇచ్చినట్లుగా సమాచారం. ఐదు వారాలకు గాను ఇంత మొత్తంలో అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది ఏం మాత్రం దానికి బిగ్ బాస్ లోకి వెళ్లడం అవసరమా చంటి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.