బిగ్ బాస్ 6: ఇనాయ సుల్తానా స్ట్రాటజీ ఏంటో అర్ధం కాట్లేదే ?
ఈ విషయాన్ని ఇంటి సభ్యులు మరియు నాగార్జున అందరూ హెచ్చరిస్తూ వచ్చారు.. ఇక ఆఖరికి సూర్య తో క్లోజ్ గా ఉండడం వలన తనకు నెగటివ్ ఫాలోయింగ్ వస్తోందని గమనించిన ఇనాయ సూర్యతో రిలేషన్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. అది జరిగి రెండు మూడు రోజులు కూడా కాకముందే శ్రీహన్ ను టాస్క్ లో బాగా ఆడాడు మరియు తనకు సలహాలు ఇచ్చాడన్న కారణంతో నువ్వు అందరికన్నా చాలా బెస్ట్ అంటూ మెచ్చుకుని... తన పుట్టినరోజున తనే స్వయంగా కేక్ చేసింది. ఇలా మెల్లగా శ్రీహన్ వైపు తన దృష్టిని మరల్చింది. ఇలా ఎవరో ఒకరితో క్లోజ్ గా ఉండి ప్రేక్షకులను గెలుచుకోవాలి అన్నది తన స్ట్రాటజీనా ? అంటూ అందరూ సందేహిస్తున్నారు.
దీని గురించి ఇంట్లో అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవడం, సెటైర్లు వేసుకోవడం, కామెడీలు చేసుకోవడం జరుగుతున్నాయి. అయితే ఇద్దరూ కూడా వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఇక నిన్న ఇనాయా నామినేషన్ చేసేటప్పుడు ఈ అపార్దాలకు ముగింపు పలకాలన్న ఉద్దేశ్యంతో శ్రీహన్ ను నామినేట్ చేసి క్లియర్ గా అందరికీ వివరించింది. అయితే ఎందుకు ఇనాయా ఇలా చేస్తోంది... తన ఆటతీరు పై ఓ క్లారిటీ ఉండడం లేదు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి నెక్స్ట్ ఎవరి మీద తన దృష్టి మరలుతుంది అన్నది తెలియాల్సి ఉంది.