టీవీ: జబర్దస్త్ పొట్టి నరేష్ సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!!

Divya
జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్ లు సైతం మంచి ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ పొట్టి నరేష్ కూడా ఒకరు. పలు సినిమాలలో.. పలు షో లలో కనిపిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక కేవలం ఒక్క టీం లోనే కాకుండా ఇతర టీములలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు నరేష్. తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను సైతం కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు. అయితే నరేష్ ఏదైనా ఒక టీంలో కనిపించాలంటే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే వార్త వినిపిస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.



ముఖ్యంగా హైపర్ ఆది తన స్కిట్ లో నరేష్ కి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పవచ్చు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతిరోజు వారి పారితోషకమును మల్లెమాలవారు నరేష్ కి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వారాముకు రెండూ లేదా మూడు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ ఉంటారు.  దీంతో అధిక మొత్తంలో నరేష్ ఆదాయం సమకూరుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా కూడా నరేష్ తన సంపాదన మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కమెడియన్లు అందరు కూడా యూట్యూబ్ ఛానల్స్ ని మొదలుపెట్టి బాగా సందడి చేస్తూ ఉన్నారు.


ఇక యూట్యూబ్లో వారికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉన్నారు. తాజాగా నరేష్ ఒక ప్రత్యేకమైన ఛానల్ ని కూడా ఏర్పాటు చేసి.. అటు యూట్యూబ్ ఛానల్ తో ఇటు జబర్దస్త్ లో దాదాపుగా నెలకు రూ.12 లక్షల రూపాయల సంపాదిస్తున్నట్లుగా సమాచారం.  మరి రాబోయే రోజుల్లో మరింత ఆదాయం పెంచుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఒక పది సినిమాలలో కూడా పొట్టి నరేష్ నటిస్తూ పలు అవకాశాలను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నరేష్  పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: