టీవీ: చమ్మక్ చంద్ర ఎలాంటివారో బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్..!!
ఆనంద్ మాట్లాడుతూ చంద్రన్న ఉన్న సమయంలోనే మేము జబర్దస్త్ లోకి వచ్చాము.. చమ్మక్ చంద్ర నాకు బెస్ట్ ఫ్రెండ్ అని.. కమెడియన్ గా తనని చాలా సార్లు ఎంకరేజ్ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఒకసారి తన టీమ్ లో ఆనంద్ ను మెయిన్ గా ఉండమని ఆఫర్ ఇచ్చారట. అయితే ఆనంద్ టీం లీడర్ గా ఉండడంతో కొంతమందితో ఉన్న సరే సపరేట్ టీం గానే ఉంటానని చెప్పారట.
అయితే చాలామంది చమ్మక్ చంద్ర కు క్యాస్ట్ పిచ్చి ఉందని.. తెలంగాణ వాళ్లను మాత్రమే చమ్మక్ చంద్ర ఎక్కువగా సపోర్ట్ చేస్తారని అంటూ ఉంటారు. కానీ చంద్రన్న అలా అనే వారిని చెప్పుతో కొట్టాలని ఎందుకంటే చంద్రన్న మనస్తత్వం అలాంటిది కాదని తెలియజేశారు ఆనంద్. చమ్మక్ చంద్ర కు ఉన్నదాంట్లోనే ఎంతోమంది జనాలకు ఖర్చు చేశారని అలాగే ఎంతోమంది కమెడియన్లకు కూడా లైఫ్ ఇచ్చారని తెలిపారు. టాలెంట్ ఉంటే చాలు ఎవరినైనా ప్రోత్సహిస్తారని తెలిపారు.ప్రస్తుతం ఆనంద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.