టీవీ: బుల్లితెరపై సుధీర్ క్రేజ్ పడిపోయిందా..?
హీరోగా వరస సినిమాలు చేస్తున్న కారణంగా జబర్దస్త్ కు డేట్లు ఇవ్వలేకపోతున్నాను అంటూ ఇతర చానల్స్ కు వెళ్లిపోయారు. దీంతో మళ్లీ తిరిగి ఈటీవీలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వినిపించాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆహా ఓటీటి లో సుధీర్ కామెడీ షో మొదటి ఎపిసోడ్ స్ట్రిమింగ్ కావడం జరిగింది. ఈ కామెడీ షో కి జనాల నుండి పెద్దగా ఆదరణ లభించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఓటిటి కార్యక్రమం అంటేనే జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేని పరిస్థితులలో టీవీ కార్యక్రమాలకు ఓటీటి కార్యక్రమాలకు కాస్త తేడా ఉంటుందని చెప్పవచ్చు.టీవీ కార్యక్రమాలు సక్సెస్ అయితే పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూస్తూ ఉంటారు. కానీ ఓటిటి కార్యక్రమాలకు తెలుగు ప్రేక్షకులు ఇంకా అలవాటు పడలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
కేవలం ఒకటి రెండు కార్యక్రమాలు మినహా ఇప్పుడు తెలుగులో ఏ ఒక్క షో కూడా ఓటీటి కార్యక్రమం ద్వారా హిట్ అయిన సందర్భాలు లేవు. పైగా ఆహా యొక్క ఖాతాదారులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని చూసేవారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక సుధీర్ చేస్తున్న కామెడీని ఎంజాయ్ చేసేవారు కానీ ఎక్కువమంది లేనట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి దీన్ని బట్టి చూస్తే సుధీర్ క్రేజ్ తగ్గిందా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.