టీవీ: యాంకర్ శ్రీముఖి నెల సంపాదన తెలిస్తే షాక్..!!

Divya
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పేరుపొందిన వారిలో శ్రీముఖి కూడా ఒకరు. ప్రస్తుతం ఏ షో లో చూసిన హోస్ట్ గా కూడా ఎక్కువగా యాంకర్ శ్రీముఖినే కనిపిస్తూ ఉంటోంది. ఒకప్పుడు యాంకర్ సుమ అలా అన్ని ఫంక్షన్లలో కనిపిస్తూ ఉండేది. కానీ ఈ మధ్య సుమ షోలు బాగా తగ్గించడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యాంకర్ల క్రేజ్ ఒక్కొక్కరికి బాగా పెరిగిపోతోంది. అలా ప్రస్తుతం శ్రీముఖి కూడా టాప్ పొజిషన్ లో ఉందని చెప్పవచ్చు. మొదటిసారిగా అదుర్స్ షో తో అడుగుపెట్టిన శ్రీముఖి యాంకర్ గా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.

ఇక అప్పటినుంచి శ్రీముఖి వరుసగా ఎన్నో షోలలో చేస్తోంది.అలాంటి పాపులర్ తోనే బిగ్ బాస్ సీజన్ 3 లోకి కూడా అడుగు పెట్టింది. అక్కడ విన్నర్ గా నిలుస్తుందనుకున్న శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. అయినా కూడా శ్రీముఖి క్రేజ్ బాగా పెరిగిపోయింది.ప్రస్తుతం ఈ క్రేజ్ తోనే వెండితెర పైన పలు సినిమాలలో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది శ్రీముఖి. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన గ్లామర్ షో చూపించడంలో మాత్రం ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది.

ముఖ్యంగా యాంకర్ గా ఎంతోమందిని ఫిదా చేసింది శ్రీముఖి. శ్రీముఖి యాంకరింగ్ ఎనర్జీ మామూలుగా ఉండదు. శ్రీముఖి కేవలం బుల్లితెరపై వెండితెర పైన నెలకి దాదాపుగా రూ.10 నుంచి 20 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లుగా సమాచారం. శ్రీముఖి ఎంతో బొద్దుగా ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం భారీగానే వెళ్ళబడుతున్నాయి .ఈమధ్య అడపదడప సినిమాలలో నటిస్తున్న ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటిస్తోంది. శ్రీముఖి కి సంబంధించి ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: