టీవీ: అనసూయ ఇలా కావడానికి కారణం ఆమెనా..?
జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండేది ఇప్పుడు ఆ షో మానేసిన తర్వాత కాస్త దూకుడు తగ్గిందని చెప్పవచ్చు.అయితే సైలెంట్ గా సినిమాలు చేసుకుంటున్నప్పటికీ అవి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అనసూయ చేస్తున్న సినిమాల వల్ల ఆమె క్రేజ్ పెరుగుతుందనుకుంటే పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. ప్రస్తుతం పుష్ప-2, రంగమార్తాండ సినిమాలలో నటిస్తోంది. వీటితోపాటు డైరెక్టర్ క్రిష్ చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో కూడా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. ఇలా తన కెరియర్లో చాలా వెయిట్ ఉన్న పాత్రల్లో చేస్తున్న అనసూయ. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం.
అయితే అనసూయ జబర్దస్త్ వీడిన తర్వాత తన క్రేజ్ అమాంతం పడిపోయింది. దీంతో అనసూయ అభిమానులు చేజేతులారా తన కెరీయర్ని పాడు చేసుకుంది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జబర్దస్త్ లో ఉంటూనే పలు సినిమా అవకాశాలు వస్తూ ఉండేవి జబర్దస్త్ లో లేకపోవడం వల్ల అనసూయ క్రేజ్ తగ్గుతోదని తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో అనసూయ నటించిన చిత్రాలు విడుదలైన పెద్దగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. మరి రాబోయే రోజుల్లో తిరిగి బుల్లితెరపై అనసూయ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. అనసూయ ఎక్కువగా తన కుటుంబాలతో గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.