టీవీ: కమెడియన్ ఆలీ ఫస్ట్ లవ్ స్టోరీ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

Divya

వెండితెర, బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి కామెడీ టైమింగ్ తో నవ్వించి ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు ఎన్నో సక్సెస్ లను కమెడియన్ ఆలీ సొంతం చేసుకున్నారు. ఆలీతో సరదాగా షోలో ఆలీ మాట్లాడుతూ.. ఎన్నో షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.  ఇకపోతే ఎక్కడికి వెళ్లినా ఆలీ మనోడు అనిపించుకున్నాను అని.. చనిపోయే వరకు ఇలాగే ఉంటాను అని.. తన మనసులో మాట బయటపెట్టారు.  అంతేకాదు తను మంచి చేస్తే తన పిల్లలకు ఆ దేవుడు మంచి చేస్తాడని ఆలీ తలుస్తాడు.
సీతాకోక చిలుక సినిమాకు మొదటి అవార్డును అందుకున్నానని ఆలీ తెలిపారు. తాను నటించిన యమలీల సినిమా ఏడాది పాటు ఆడిందని కూడా కామెంట్లో చేశారు. ముఖ్యంగా 150కి పైగా సినిమాలలో తాగుబోతు పాత్రలో నటించాలని సౌత్ భాషలను కూడా మాట్లాడగలను అని.. ఇతరులు మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవాలని కూడా ఆలీ తెలిపారు. కమెడియన్ కావాలని సినిమాల్లోకి వచ్చానని ఆలీ చెప్పుకొచ్చారు.  ఆలీ మాట్లాడుతూ .. మా ఇంటికి దగ్గరలో ఒక అమ్మాయి ఉండేది.. ఒక రోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వెళ్లడం చూసి గొడుగు కొనిచ్చాను.  అది మా అమ్మకు నచ్చలేదు.. అమ్మాయి కూడా మా అమ్మకు నచ్చలేదు. అందుకే పెళ్లి వద్దని అనుకున్నామని ఆలీ కామెంట్ లు చేశారు.
ఆ తర్వాత మరో అమ్మాయితో పెళ్లి జరగాల్సి ఉన్న ఆగిపోయిందని ఆలీ పేర్కొన్నారు.  ఆ తర్వాత జుబేదాను వివాహం చేసుకున్నాను అని ఆలీ తెలిపారు.  అయితే ఇవన్నీ కూడా ఆలీతో సరదాగా కార్యక్రమంలో సుమాతో ఆలీ చర్చించడం జరిగింది. ఇటీవల ఎందుకు సంబంధించిన ప్రోమో విడుదలవగా అది మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ ఎపిసోడ్ చివరి ఎపిసోడ్.. ఆలీతో సరదాగా షో ఇక మూత వేయబడబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: