టీవీ: అప్పుడే సినిమాలో అవకాశం కొట్టేసిన జబర్దస్త్ కొత్త యాంకర్..!
జబర్దస్త్ కార్యక్రమంలో కనిపిస్తే చాలు సినిమాలలో అవకాశాలు వస్తాయని మరొకసారి సౌమ్య ద్వారా వెళ్లడైంది అని చెప్పవచ్చు. సౌమ్య జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి కనీసం రెండు నెలలు కూడా కాలేదు . అప్పుడే అనుకున్నట్టుగా అవకాశం లభించింది. ఒక యంగ్ హీరో సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం లభించింది. మరొకవైపు ఇంకొక చిన్న సినిమాలో ఐటెం సాంగ్ చేసే అవకాశాన్ని కూడా సొంతం చేసుకున్నదట. మొత్తానికైతే జబర్దస్త్ తీసుకొచ్చిన క్రేజ్ తో అటు వెండితెరకు కూడా పరిచయం కాబోతోంది ఈ ముద్దుగుమ్మ.
నిజానికి బుల్లితెరపై పలు సీరియల్ ద్వారా చాలా కాలంగా ఈమె సందడి చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీ ఎప్పుడూ కూడా ఈమెకు రాలేదని చెప్పాలి. ఒకవేళ సినిమాలలో కూడా ఈమె సక్సెస్ పొందింది అంటే ఇక అక్కడే అనసూయ రేంజ్ లో అవకాశాలు వచ్చి అవకాశమైతే కనిపిస్తోంది. జబర్దస్త్ తో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో కూడా సౌమ్య పాల్గొని సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే సౌమ్య అందంగా ఉండడంతో పాటు చలాకీగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ క్రేజ్ ఈమెకు దక్కిందని చెప్పవచ్చు.