ఆసియా - నూకరాజు లకు షాకిచ్చిన తల్లిదండ్రులు..!
అయితే తాజాగా జబర్దస్త్ షోలో టీం లీడర్ గా అదరగొట్టేస్తున్నాడు నూకరాజు. అయితే తన ప్రేయసి ఆసియాతో కలిసి ఇప్పుడు స్కిట్లు చేస్తున్నాడు వీరిద్దరి లవ్ ట్రాక్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం కొత్త లవ్ ట్రాక్ నడిపే నేపథ్యంలో జబర్దస్త్ మీద బాగానే వీరికి గుర్తింపు లభిస్తోంది. ఇన్ని రోజులు సోషల్ మీడియా ద్వారా కలిసి సందడి చేసిన వీరు ఇప్పుడు జబర్దస్త్ షోలో పలు స్కిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ నుంచి రిలీజ్ చేసిన ప్రోమోలో నూకరాజు, ఆసియాలకు ఎదురు దెబ్బ తగిలినట్టు అయిందని చెప్పవచ్చు.
అసలు విషయం ఏమైంది అంటే.. నూకరాజు చాలా సందర్భాలలో ఆసియాపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. తను ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను అని.. ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా అడగను అని నూకరాజు అన్నాడు. కానీ వీరిద్దరికీ అనుకోని విధంగా షాక్ తగిలింది. నూకరాజు , ఆసియాలు తమ తమ పేరెంట్స్ ని తీసుకొచ్చి స్కిట్లు చేయడం జరిగింది. ఈ ప్రోమోలో చివరికి ఇంద్రజ అన్న మాటలకు నూకరాజు తల్లి ఊహించని రేంజ్ లో కౌంటర్ వేసింది. ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత తాంబూలం మార్చుకునేటప్పుడు పక్కకు జరుగుతారేంటి? అని ఇంద్రజ అడగగా.. కేవలం స్కిట్ కోసం మాత్రమే అన్నారు.. నిజంగా అయితే కుదరదు మేడం అంటూ ఖరాకండిగా చెప్పేసరికి ఆసియా, నూకరాజులు తెల్ల ముఖం వేసుకున్నారు.