టీవీ: బుల్లెట్ భాస్కర్ అంటే కుష్బూకు ఎందుకంత ఆప్యాయత.!

Divya
జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా జబర్దస్త్ షో అంటేనే యాంకర్ రష్మి, సుడిగాలి సుదీర్ పేర్లు బాగా గుర్తుకొస్తాయి. వారిద్దరి తర్వాత జబర్దస్త్ లో చాలామంది జోడీలు కూడా వచ్చి అందరిని ఎంటర్టైన్మెంట్ చేశాయి. మధ్యలో వర్ష, ఇమ్మాన్యుయేల్ జంట కూడా నవ్వించే ప్రయత్నం చేసింది. కానీ వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫేక్ లవ్ అంటూ అందరికీ అర్థమయిపోయింది. అందుకే వారిని జనాలు కూడా పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ స్టేజ్ పై బుల్లెట్టు భాస్కర్ కుష్బూల జోడి సందడి చేస్తోంది. ప్రతి ఎపిసోడ్లో కూడా కలిసి డాన్స్ చేయడం లేదంటే ఇద్దరి మధ్య రొమాంటిక్ సంభాషణలు ఉంచడం లాంటిది స్కిట్ కి హైలెట్గా నిలుస్తున్నాయి.
విడుదలైన జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమోలో ఏకంగా ఇద్దరు కలిసి డాన్స్ చేయడం.. అది కూడా రొమాంటిక్ సాంగ్ చేయడంతో చూసేవారికి విడ్డూరంగా అనిపించింది.. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలసి డాన్స్ చేసిన ఖుష్బూ బుల్లెట్ భాస్కర్ తో డాన్స్ చేయాల్సి రావడం అందరికీ విడ్డూరంగా అనిపించింది అంటూ చాలామంది అభిమానులు కూడా వ్యక్తం చేస్తున్నారు.. ఇదంతా షో రేటింగ్ రావడానికి కోసమే చేస్తున్నారు అంటే కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా రేటింగ్ కోసమే అని తెలిసిన కూడా చూసే ప్రయత్నం చేసుకోలేకపోతున్నారు.
అసలు వీరిద్దరి మధ్య ఎందుకు ఇంతలా ఇలాంటి బాండింగ్ ఎలా ఏర్పడింది అనేది అర్థం కాని ప్రశ్న.అసలు ఏమైంది అనే విషయానికి వస్థే..రేటింగ్ కోసమే ఇదంతా అన్నట్టు గా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కుష్బూ జడ్జ్, బుల్లెట్ భాస్కర్ టీం లీడర్.. ఇద్దరి మధ్య బాండింగ్  వుండేలా చూపించడం తో షో కి హైలెట్ అవ్వాలి అని చూస్తున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: