హాట్ టాపిక్ గా మారిన జబర్దస్త్ కొత్త యాంకర్ పారితోషికం..!

Divya
బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఎటువంటి బ్రేక్ తీసుకోకుండా దాదాపు 10 సంవత్సరాలకు పైగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక షో జబర్దస్త్ అని చెప్పవచ్చు . ఈ జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమై అతి తక్కువ సమయంలోనే సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకున్నారు. అంతేకాదు జబర్దస్త్ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు కూడా చాలామంది ఉన్నారటంలో సందేహం లేదు. ముఖ్యంగా రోజా, నాగబాబు లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు జబర్దస్త్ లోకి వచ్చి తమ అప్పులను కూడా తీర్చుకున్నాం అని తెలియజేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా జబర్దస్త్ లో 9 సంవత్సరాల పాటు అలుపెరుగని వ్యక్తిలా తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ జబర్దస్త్ బ్రేక్ ఇవ్వడంతో ఆస్థానంలో రష్మీ వచ్చింది. కానీ రష్మికి అప్పటికే ఎక్స్ట్రా జబర్దస్త్,  శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ఉండడంతో ఆమె ఇబ్బందిగా ఉందని మల్లెమాల టీం ను వేడుకుందట. ఈ క్రమంలోని ప్రముఖ సీరియల్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కన్నడ ముద్దుగుమ్మ సౌమ్యారావ్ ను  జబర్దస్త్ కి యాంకర్ గా  తీసుకొచ్చారు అయితే ప్రస్తుతం ఈమె పారితోషకం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
షో కి వచ్చిన కొత్తలో చాలా రోజులు ఈమె షోలో యాంకర్ గా కొనసాగలేదు అని అంతా అనుకున్నారు.  కానీ అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ కమెడియన్స్ కు అలవాటు పడిపోయిన సౌమ్యరావు భారీ స్థాయిలో పారితోషకం పుచ్చుకుంటుందని సమాచారం . ఇక తాజాగా అందుతున్న ప్రకారం సౌమ్యరావు ఒక్క జబర్దస్త్ నెలకు సుమారుగా మూడు లక్షల రూపాయలు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే స్టార్ యాంకర్ రేంజ్ లో ఈ పారితోషకం తీసుకోవడం నిజంగా గ్రేట్ అందులోనూ అతి తక్కువ సమయంలోనే ఇంత రేంజ్ లో పారితోషకం తీసుకోవడం అంటే ఆమె క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: