టీవీ: ఇమ్మానియేల్ అనుమానం నిజం చేసిన వర్ష.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో..!
వర్ష ప్రేమికుడు చాలా బాగున్నాడు.. ముద్దుగా, బొద్దుగా వర్షాకు సరైన జోడి అంటూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ జంటపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే లవర్ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. కానీ అతగాడు ఎవరో మొత్తంగా చూపించొచ్చు కదా అని నెటిజెన్లు మాత్రం ఆమెకు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు మరింత సంచలనాలకు దారి చూస్తోంది.
తాజాగా వర్ష ఇమ్మానియేల్ మధ్య వాగ్వాదం మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇకపోతే దీనికి హైపర్ ఆది కారణమయ్యాడు అని చెప్పవచ్చు వర్ష వేరొకరితో రీల్స్ చేస్తోందని ఇమ్మానుయేల్ కి ఆది చెప్పడం.. చస్తే చేయదు.. నేను నమ్మను అని ఇమ్మానుయేల్ అనడం.. అన్నీ మనం చూశాం.. దానితో చూడు అంటూ ఒక అజ్ఞాత వ్యక్తితో వర్ష సన్నిహితంగా ఉన్న వీడియోను వేదికపై ప్లే చేయించారు ఆది . దాంతో ఇమ్మానుయేల్ గుండె బద్దలైంది. అప్పటివరకు వేరొకరితో వర్ష వీడియోలు చేయదని నమ్మిన ఇమ్మానుయేల్ నమ్మకం కాస్త వమ్ము అయింది. దీంతో ఆగ్రహానికి గురైన ఇమ్మానుయేల్ వర్షా ను నిలదీస్తూ వాడు వీడేనా లేక వాడా నేనా అంటూ ఫైరయ్యాడు . మొత్తానికైతే ఇమ్మానుయేల్ కు దెబ్బ కొడుతూ వర్ష కొత్త బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది.