స్టేజిపై కన్నీళ్లు పెట్టుకుంటూ అందరిని ఏడిపించేసిన శేఖర్ మాస్టర్..!

Divya
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎంతో కష్టపడి ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. శేఖర్ మాస్టర్ తన కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఢీ 15 ప్రోమో ను విడుదల చేయగా అందులో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ కావడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది.. తండ్రి విలువ తెలియాలి అంటే "ఆ తండ్రికి కొడుకా పుడితే సరిపోదు ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తండ్రి విలువ తెలుస్తుంది" అంటూ చెబుతూ కంటెస్టెంట్లు మన్నించయ్య తప్పు మన్నించయ్య అనే పాటకు డాన్స్ చేయడం జరిగింది..
ఇక ఆ డాన్స్ పర్ఫామెన్స్ చూసిన శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.  ఆయన మాట్లాడుతూ అందరు కొడుకులకు చెబుతున్నాను.. తండ్రి ఉన్నప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకోండి.. మిస్ యు నాన్న అంటూ తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. ఇకపోతే ఈ ప్రోమోకి సుమారుగా రూ.12 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం. ఈనెల 19వ తేదీన ఈ ఎపిసోడ్ బుల్లితెరపై ప్రసారం కానున్న నేపథ్యంలో ప్రోమోనో వదిలారు. అయితే ఈ ప్రోమో గుండెలను కదిలించిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
శేఖర్ మాస్టర్ గతంలో కూడా పలు సందర్భాలలో.. తండ్రిని తలుచుకోవడంతోపాటు తండ్రి గొప్పదనం గురించి కూడా కామెంట్లు చేశారు. శేఖర్ మాస్టర్ పారితోషకం ఇప్పుడు ఒక్కో పాటకు 5 లక్షల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు.. ఇకపోతే శేఖర్ మాస్టర్ కి హీరోలలో కూడా భారీ క్రేజీ పెరిగిపోయింది. సీనియర్ హీరోలు కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి ఫిదా అవుతున్నారు. కొంతమంది హీరోలు తమ ప్రతి సినిమాలో కూడా ఈయనకు అవకాశం ఇస్తున్నారు. ఇకపోతే  శేఖర్ మాస్టర్ రేంజ్ మరింత పెరగాలని ఆయన కెరియర్ పరంగా ఆఫర్లు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: