అర్జున్ కళ్యాణ్ ని ముద్దులతో ముంచేత్తేసిన శ్రీ సత్య.. పోటీపడి మరీ..!

Divya
ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎన్నో రియాల్టీ షోలు వస్తున్నాయి. అందులో బిగ్ బాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ పొందుతోందని చెప్పాలి. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తయినా ఏడవ సీజన్ కోసం ఇంకా అభిమానులు ఎదురుచూస్తున్నారు. గడిచిన ఆరవ సీజన్లో అర్జున్ కళ్యాణ్, శ్రీ సత్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదని చెప్పాలి. మొదట్లో హౌస్ లో ఉన్నంతసేపు శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ ను పట్టించుకోకపోయినా అతడు వెళ్లిపోయేటప్పుడు మాత్రం బాగా ఏడ్చింది. ఇక అర్జున్ కళ్యాణ్ ఏమో శ్రీ సత్య కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాను అంటూ కూడా కామెంట్లు చేశాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలామంది వివిధ షోలలో అలరిస్తున్నారు.  ఈ క్రమంలోని ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి అర్జున్ కళ్యాణ్, వాసంతి లతో పాటు శ్రీ సత్య , మెహబూబ్ జంటగా వచ్చారు. ఇకపోతే అర్జున్ కళ్యాణ్ పై శ్రీ సత్య గన్ను ఎక్కు పెట్టడం ఓంకార్ పెట్టిన తికమక షో చాలా ఉత్కంఠగా సాగింది. గేమ్ మధ్యలో ఈ జంటలు స్టేజ్ పై డాన్స్ కూడా చేశారు. వాసంతి.. అర్జున్ కళ్యాణ్ పర్ఫామెన్స్ చేస్తుండగా ఏమైందో తెలియదు కానీ వాసంతి ఉన్నట్టుండి అర్జున్ బుగ్గపై ముద్దు పెట్టింది. ఇక నేనేం తక్కువ కాదంటూ పోటీపడి మరీ శ్రీ సత్య కూడా అర్జున్ బుగ్గపై ముద్దు పెట్టింది.  ఇలా ఇద్దరు భామలు పోటీపడి మరీ అర్జున్ కి డబుల్ ఆఫర్ ఇచ్చారని చెప్పవచ్చు.
ఇక చూసిన మెహబూబ్ ఏంటమ్మా.. మాకు ఏం లేవా.. అంటూ కామెడీ కూడా పండించారు. దీంతో ఓంకార్ తో సహా అక్కడ ఆడియన్స్ కూడా నవ్వుకున్నారు.  ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మరొకవైపు అర్జున్ కళ్యాణ్ భలే లక్కీ ఫెలో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: