టీవీ: ప్రగతిని అవమానించిన నెటిజన్.. తనదైన స్టైల్ లో స్ట్రాంగ్ వార్నింగ్..!
సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ట్రోల్స్ ఎదుర్కోవడం సర్వసాధారణం.. అందులో కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తే.. మరికొంతమంది అన్నవారి నోరు మళ్లీ తెరవకుండా చేస్తారు. అలాంటివారిలో ప్రగతి కూడా ఒకరు. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తల్లి , అత్త, పిన్ని వంటి పాత్రలలో నటించి మెప్పించిన ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక రెండేళ్ల క్రితం నుంచి ఫాలోవర్స్ ను బాగా పెంచుకుంటుంది. అప్పుడప్పుడు ఈమె చేసే హడావిడి మామూలుగా ఉండదు. ఇక ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా తన గ్లామర్ ను ఏమాత్రం తగ్గించకుండా మరింత పెంచుకుంటూ వస్తోంది.
ఈ క్రమంలోని తాజాగా ఒక ఫోటో షేర్ చేసిన ప్రగతి కొంచెం లో అందాలు కనిపించేలా ఆ ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు ఆమె బాడీ పార్ట్స్ పై వల్గర్ కామెంట్లు చేశారు. దీంతో ఆ నెటిజెన్లకి మరొకసారి నోరు తెరిచే ఛాన్స్ లేకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ప్రగతి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికీ కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరింత దూసుకుపోతోంది.