TV: లైఫ్ లో ఆ కష్టాలు మరువలేని.. సీరియల్ నటి మాహి గౌతమి..!
రంగులరాట్నం, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి సీరియల్స్ లో హీరోయిన్గా నటిస్తున్న మాహి గౌతమి అచ్చ తెలుగు అమ్మాయి. పుట్టి పెరిగింది అంతా హైదరాబాదులోనే.. తెలంగాణకు చెందిన ఈమె మొదటిగా వనిత ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించి.. ఆ తర్వాత రేడియో జాకీగా ఒక రేడియో ఛానల్లో కూడా పనిచేసింది.. అలా రేడియో జాకీగా కెరియర్ను కొనసాగించిన ఈమెకు సీరియల్స్ అంటే చాలా ఇష్టమట.. అందుకే తాను మొదట సీరియల్స్ లోకి అడుగు పెట్టాలని అనుకోకుండానే అడుగు పెట్టినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించండి. ఇకపోతే తాను ఈ స్టేజ్ కి రావడం వెనుక తాను పడిన కష్టాల గురించి ఎమోషనల్ అయింది.
ఇకపోతే ప్రతి సందర్భంలో కూడా తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని.. ప్రస్తుతం నటిస్తున్న రంగుల రాట్నం, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్స్ రెండిట్లో కూడా తన క్యారెక్టర్ తనకు బాగా నచ్చింది అని బయటకు వెళ్తే చాలామంది లక్ష్మి , మహాలక్ష్మి అంటూ పిలుస్తున్నారు అని కొంతమంది పెద్దవాళ్లు తనను పట్టుకుని ఏడ్చేస్తున్నారు.. ఇన్ని కష్టాలు పడుతున్నావు అంటూ బాధపడుతున్నారని చెప్పుకొచ్చింది మాహీ గౌతమీ.