
టీవీ: ప్రముఖ హీరోయిన్ సదా ఇక బుల్లితెరకే పరిమితమా..?
ఇకపోతే ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించనియమే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షోలో జడ్జిగా రెండు సీజన్లలో అలరించి ఇక వెళ్ళిపోయింది. ఆ తర్వాత అయినా మళ్లీ వస్తుందని అనుకున్నారు కానీ ఇటీవలే మల్లెమాల టీంలోకి ఆమె రియంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నాగబాబు రోజా జడ్జిలుగా వ్యవహరించగా ఇక వారు వివిధ కారణాలవల్ల జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఇంద్రజ , కృష్ణ భగవాన్ అప్పుడప్పుడు కుష్బూ వచ్చి జడ్జిలుగా సందడి చేస్తున్నారు అనుకుంటే అప్పుడప్పుడు మారుతూ ఉండడం గమనార్హం.
అందుకే ఈసారి వచ్చి వెళ్లే జడ్జి కాకుండా సదాని ఫుల్ టైం జడ్జిగా ఫిక్స్ చేయాలని మల్లెమాల టీం అనుకుంటున్నట్లు సమాచారం
తాజాగా గతవారం ప్రసారమైన జబర్దస్త్ ఎపిసోడ్ లో సదా కనిపించిన విషయం తెలిసిందే ఇక ఈసారి ఆమె బుల్లితెరను విడిచి వెళ్లదనే కామెంట్ వినిపిస్తున్నాయి ఇక ఫిమేల్ జడ్జిగా సదానో ఫిక్స్ చేసి అటు ఎక్స్ట్రా జబర్దస్త్ రెండింటిలో కూడా ఆమెనే జడ్జిగా కొనసాగించబోతున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే మల్లెమాలవారు సరికొత్తగా ఆడియన్స్ అలరించడానికి సదను తీసుకొచ్చినట్లుగా స్పష్టం అవుతుంది. మొత్తానికి అయితే సినిమాలలో ఈమెకు అవకాశాలు వచ్చిన రాకపోయినా బుల్లితెరపై మాత్రం గట్టిగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక ఈమె కెరియర్ మారిపోయినట్లే అని చెప్పడంలో సందేహం లేదు