టీవీ: ఈ బుల్లితెర హీరోలు ఎక్కడివారో తెలుసా..!
నిరుపమ్.. నిరుపమ్ పరిటాల ఏపీలోని కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన వ్యక్తి.. అర్జున్, ప్రియతమ్, రవికృష్ణ లు కూడా విజయవాడ నుంచి వచ్చిన వారే.. మరొకవైపు సిద్ధార్థ వర్మ , అమరదీప్ చౌదరిలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్లు కావడం గమనార్హం. వీ . జే.సన్నీ తెలంగాణలోని ఖమ్మం డిస్ట్రిక్ట్ లో జన్మించారు. మధుబాబు కూడా తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం విశేషం మరొకవైపు శివకుమార్, నాగార్జునలు కేరళ రాష్ట్రానికి చెందిన వాళ్లు కానీ వీళ్లు తెలుగులో తమ సత్తా చాటుతూ తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇక ఒక కేరళ తెలుగు నటీనటులే కాకుండా కర్ణాటకలోని బెంగళూరుకి చెందిన వ్యక్తులు కూడా ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆకర్ష్, ముఖేష్ గౌడ లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులే కావడం గమనార్హం. గోకుల్ వంటి వారు చెన్నైకి చెందిన వాళ్లు. ఇక వీరితోపాటు చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగులో తమ సత్తా చాటుతున్నారు అలాగే పలు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లు కూడా తెలుగులో సత్తా చాటుతో మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు అయితే హీరోయిన్లు చాలావరకు బెంగళూరు నుంచి వస్తూ ఉండడం గమనార్హం.