టీవీ: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ వీళ్లే..!

Divya
తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటివరకు తెలుగులో ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాల్టీ షో ఇప్పుడు త్వరలోనే ఏడవ సీజన్ కి సిద్ధం అవుతుంది ఇదివరకే సీజన్ కి సంబంధించిన హోస్ట్ అలాగే కంటెస్టెంట్ ల పేర్లు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు హోస్ట్ గా నాగార్జున వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఏడవ సీజన్ నుంచి తప్పుకోవడంతో ఇక కొత్త హోస్ట్ ఎవరు వస్తారు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

 అంతే కాదు ఈసారి ఆరవ సీజన్ లాగా నష్టపోకుండా కంటెస్టెంట్లను భారీగా పాపులారిటీ ఉన్నవాళ్లను తీసుకొచ్చి షోని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి అన్నీ సిద్ధం  చేస్తున్నారు నిర్వాహకులు.ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా ఏడవ సీజన్లోకి రాబోయే కంటెస్టెంట్ ల గురించి ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. ఇక అలా కంటెస్టెంట్ గా వచ్చే వారిలో అమర్దీప్ ,ఆయన భార్య జంటగా రాబోతున్నారు. వీరితోపాటు యాంకర్ రష్మీ గౌతమ్, దీపిక పిల్లి , నటి ఐశ్వర్య, సింగర్ హేమచంద్ర , నటి మిత్ర శర్మ , డాన్సర్ శ్వేతా నాయుడు, యూట్యూబర్ నిఖిల్, ట్రాన్స్ జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనాక్, సింగర్ మోహన భోగరాజు, సింగర్ మంగ్లి, కామన్ మ్యాన్ కేటగిరీలో పల్లవి ప్రశాంత్ కంటెస్టెంట్ లుగా ఎంపికయ్యారు.

ఇకపోతే ఈ ఏడవ సీజన్ కూడా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మరి. మొత్తానికైతే ఈసారి సీజన్ సెవెన్ లోకి బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు వస్తున్నారు. మరి ఏ రేంజ్ లో వీరు ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: