ఇదేం.. ఎల్లో జర్నలిజం బాబాయిలూ?
కానీ కాలం మారింది. అన్ని మీడియా యాజమాన్యాలు ఏదో రాజకీయ పార్టీకి తొత్తులుగా మారి విలేకరులతో తమ పార్టీలకు అనుకూలంగా వార్తలు రాయించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు పత్రిక రంగంలో కొన్ని పత్రికలు టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయడం, సాక్షి దినపత్రిక వైసీపీకి అనుకూలంగా పని చేయడం అనేది ప్రజలతో పాటు జగమెరిగిన సత్యం.
ఈ రెండు పత్రికల్లో వార్తలు వస్తే అది కచ్చితంగా ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా ఉండటం సహజం. ఇలా ఎవరికి వారు ఇష్టరీతిన వార్తలు రాస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఏదీ నిజమో ఏదీ అబద్దమో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మీడియా సంస్థలు, టీవీ చానళ్లు కూడా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాయిస్తూ వారి రాజకీయ భవిష్యత్తును డ్యామెజ్ చేస్తున్నాయి.
కాపు రాంచంద్రరెడ్డి ఆయన నియోజకవర్గంలోని బొమ్మిన మండలం గౌసురు గ్రామంలో మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. రెండు ఎల్లో పత్రికల్లో ఆయన ముఖంపైనే తలుపులు వేశారని అబద్ధపు వార్తలు రాశారని అన్నారు. వంద గడపలు ఇళ్లు ఉన్న చోట కేవలం 11 ఇళ్లు తలుపులు వేసి ఉన్నాయన్నారు. వారు పత్తి ఏరడానికి చేనులోకి వెళ్లాలన్నారు. జర్నలిజం చేసే వారు బ్రోకర్ పనులు మానుకోవాలని విలేకరులపై మండి పడ్డారు.