టీవీ: రాకేష్ మాస్టర్ గురించి తెలియని విషయాలు చెప్పిన శేఖర్ మాస్టర్!
ఈ కార్యక్రమంలో భాగంగా రాకేష్ మాస్టర్ శిష్యులు అంతా కూడా ఆయనతో గడిపిన క్షణాలను వెల్లడిస్తూనే ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏడాది జాతీయ పురస్కారాలను ప్రకటించబోతున్నట్లుగా కూడా వెల్లడించారు. అందులో భాగంగానే శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శేఖర్ మాస్టర్ తో తనకు ఎనిమిదేళ్ల అనుబంధం ఉంది అని తెలిపిన ఆయన ఒక గొప్ప డాన్సర్ అని.. ఆయన డాన్స్ కు సంబంధించి యూట్యూబ్లో మీరు చూసింది కేవలం ఐదు శాతం మాత్రమే అంటూ తెలిపారు.
అంతేకాదు రాకేష్ మాస్టర్ టాలెంట్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు అని.. తాను కూడా మొదట్లో ప్రభుదేవా మాస్టర్ ను స్ఫూర్తిగా తీసుకున్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత రాకేష్ మాస్టర్ కు అభిమానిగా మారిపోయానని వెల్లడించారు. ముఖ్యంగా డాన్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే మాస్టరు ఊరుకునేవారు కాదు అని.. అలా ఆయన క్రమశిక్షణ నేడు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది అని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు తాను రాకేష్ మాస్టర్ శిష్యుడిని అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది అని కూడా శేఖర్ మాస్టర్ వెల్లడించారు.